BigTV English

Manchu Vishnu: నేను హిందూ.. నా భార్య క్రిస్టియన్.. కన్నప్ప విడుదల వేళ అవసరమా విష్ణు?

Manchu Vishnu: నేను హిందూ.. నా భార్య క్రిస్టియన్.. కన్నప్ప విడుదల వేళ అవసరమా విష్ణు?

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా(Kannappa Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం సైతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పరమశివుడి మహత్వాన్ని తెలియచేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున శివాలయాలకు వెళ్తూ ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.


పక్కా హిందువు…

ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో కూడా ఏర్పాటు చేసిన వాయు లింగానికి ప్రతిరోజు పూజలు చేసిన తర్వాతనే షూటింగ్ జరిగేది అంటూ కూడా విష్ణు తెలియజేస్తూ వచ్చారు. ఇలాంటి ఒక సినిమాలో మంచు విష్ణు నటించి ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈయన మతాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ నేను హార్డ్ కోర్ హిందువుని(Hindu). కానీ నా భార్య మాత్రం క్రిస్టియన్(Christian) అంటూ తెలియజేశారు. ఆమె ప్రతిరోజు బైబిల్(Bible) చదువుతుంది, అదేవిధంగా పడుకోవడానికి ముందు బైబిల్ బెడ్ మీద నా తల దగ్గరే పెడుతుంది.


దేవుడు ప్రతి చోట ఉన్నాడు…

నాలో ఉన్నటువంటి రాక్షసుడిని తరిమి కొట్టడం కోసం అలా నా భార్య బైబిల్ ఎప్పుడూ నా తల దగ్గరే పెడుతుంది అంటూ  సరదాగా చెప్పారు.  ఇలా క్రిస్టియన్, హిందూ అని కాకుండా దేవుడు ప్రతి చోటా ఉంటాడని మనం మనస్ఫూర్తిగా మన హృదయంతో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టేనని, ఈ విషయాన్ని తాను నమ్ముతానని విష్ణు తెలిపారు. మనం మనస్ఫూర్తిగా దేవుని తలుచుకొని మాట్లాడితే మనకంటూ  మనశ్శాంతి దొరుకుతుందని విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు. హిందూ క్రిస్టియన్ అని కాకుండా మనస్ఫూర్తిగా మనం దేవుని ప్రార్థిస్తే చాలు అనే ఉద్దేశంలో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బైబిల్ చదువుతుంది…

ఇక మంచు విష్ణు విరానికా(Viranica) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. అయితే ఈమె స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లి వరుస అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తె విరోనికా కావటం విశేషం దీంతో ఈమె క్రిస్టియన్ అని ఇప్పటికీ కూడా తను బైబిల్ చదువుతుందని విష్ణు తెలియజేశారు. ఇక మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరికొన్ని రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈయన హిందూ క్రిస్టియన్ అంటూ మాట్లాడటంతో అభిమానులు సినిమా విడుదల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఇలా క్రిస్టియన్ హిందూ అంటూ మాట్లాడటంతో తన సినిమాకి ఇబ్బందిగా మారుతుందని చెప్పాలి. ఇక కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Also Read: శ్రీదేవిని అవమానించిన నాగార్జున… విడిచి పెట్టేదే లేదంటున్న ఫ్యాన్స్

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×