Best Places to Visit in Monsoons: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వర్షపు చినుకులుతో, పచ్చని ప్రకృతితో వాతావరణం అంతా ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో చాలా మంది వాటర్ ఫాల్స్ చూడాలని సంబరపడుతుంటారు. అయితే మన భారతదేశంలోనే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటిని చూడడానికి చాలా అందంగా కన్నుల విందుగా ఉంటుంది. అవి మరేక్కడో కాదు మహారాష్ట్ర ప్రాంతంలోనే మీరు చూడటానికి 30 జలపాతాలు ఉన్నాయి. అవి ఎవెవో ఇప్పుడు చూద్దాం..
తొస్ఘర్ జలపాతం:
ఇది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంది. ఇవి చాలా ఎత్తైన జలపాతాలు. ఈ జలపాతం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో జలపాతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ప్రకృతి ప్రేమికులు అయితే ఇక్కడ మీకు చాలా ఆనందం దొరుకుతుంది.
గార్బెట్ జలపాతం:
వర్షాకాలంలో ఇక్కడికి వెళితే మళ్లి తీరిగి రావలనిపించని జలపాతం ఇది. వర్షాకాలంలో మేఘాల నిరంతరం గార్బెట్ పీఘభూమిని దాక్కుంటూ వర్షంతో ఆడుకుంటాయి. మాథెరాలన్‌లోని గార్బెట్ పాయింట్ నుండి ఈ పీఠభూమి దృశ్యం కలల సృష్టి.
కునే జలపాతం:
కునే జలపాతం మహారాష్ట్రలోని నావాలా ఖండాల ప్రాంతంలో ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మూడు అంచెలలో సుమార 200 మీటర్ల ఎత్తునుండి పడుతుంది. వర్షాకాలంలో ఇది మరింత రమణీయంగా, ముఖ్యమైన ఆకర్షణగా మారుతుంది.
నివాతి జలపాతం:
ఇది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన జలపాతం, ఎందుకంటే ఇది సముద్రంలోకి ప్రవహిస్తుంది. సహజంగా ఏర్పడిన రాతి వంపు నుంచి నీరు సముద్రంలోకి దూకుతుంది. ఈ జలపాతం అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది.
కావలసాద్ పాయింట్:
కావలసాద్ ఒక అందైన పర్యాటక ప్రదేశం, ఇది మహారాష్ట్రలోని అంబోలి ఘాట్‌లో ఉంది. ఈ ప్రాంతం దట్టమైన అడవులకు, జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా, ఇక్కడ రివర్స్ జలపాతం ఉంటుంది. కావలసాద్ పాయింట్ నుండి లోయల యొక్క దృశ్యాన్ని, చిన్న జలపాతాలను కూడా చూడవచ్చు.
కటల్థార్ జలపాతం:
కటాల్థార్ జలపాతం.. ఇది లొనావాలా సమీపంలో ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం. ఎత్తైన ప్రదేశాల నుండి జలపాతం నీరు కిందకు దూకుతూ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువగా ముంబై, పూణే వారు ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు.
రివర్స్ జలపాతం:
రివర్స్ వాటర్ ఫాల్స్.. సాధారణంగా జలపాతాలు పై నుంచి కిందకు పారుతాయి, కానీ రివర్స్ జలపాతాలలో నీరు కింద నుండి పైకి వెళుతుంది. దీనికి కారణం ఇక్కడ బలమైన గాలులు వీస్తాయి. ఆ గాలులు నీటి ప్రవాహాన్ని పైకి నెట్టి వేస్తాయి. దీంతో నీరు పైకి ప్రవహిస్తుంది. ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది, అందుకే ప్రకృతి అద్భుతంగా పరిగణించబడుతుంది.
Also Read: బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?
అశోక జలపాతం:
అశోక జలపాతం, విహీగావ్ జలపాతం అని కూడా పిలుస్తారు, ఇది మహారాష్ట్రలోని ఇగాట్‌పురి సమీపంలో ఉంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి. వర్షాకాలంలో, ఈ జలపాతం చుట్టూ ఉన్న కొండల నుండి నీరు ఉవ్వెత్తున కిందకు దూకుతూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది.