E-Paper
Advertisement

రామాయణంలో సీత పాత్ర పై.. అలనాటి సీత షాకింగ్ కామెంట్స్!

రామాయణంలో సీత పాత్ర పై.. అలనాటి సీత షాకింగ్ కామెంట్స్!
Advertisement

Ramayana:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన 4వేల కోట్ల బడ్జెట్ చిత్రం రామాయణ. ఈ సినిమా మొదటి భాగాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుంది. అటు స్టార్ సెలబ్రిటీలు, ముఖ్యంగా సౌత్ సెలబ్రిటీలు రామాయణం చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు ధనుష్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరో కూడా సీత పాత్ర పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

రామాయణ సీత పాత్రపై బుల్లితెర సీతమ్మ రియాక్షన్..

అయితే ఇప్పుడు బాలీవుడ్ సినిమా పైనే, బాలీవుడ్ సెలబ్రిటీల నుండి వ్యతిరేకత నెలకొనడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అలనాటి సీతమ్మ రామాయణ చిత్రంలో సీత పాత్రపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ సీరియల్ లో సీతమ్మగా నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అలనాటి నటి దీపిక చిఖాలియా. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ బుల్లితెర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈనాటికీ ప్రేక్షకులు దీపికను, ఆమె పోషించిన సీతమ్మ పాత్రను మరిచిపోలేదు అంటే ఆమె పాత్ర ఏ రేంజ్ లో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

సహనశీలి అయిన సీతమ్మను యోధురాలిగా చూపించడం ఏంటి?

Advertisement

ఇకపోతే నితేష్ తివారీ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించారు. నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కూడా పోరాటాలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రామాయణం లో శాంతి, సహనానికి ప్రతిరూపమైన సీత ఎక్కడ కూడా యోధురాలిగా చూపించలేదు. అలాంటి ఈమెను ఈ సినిమాలో ఎందుకు యోధురాలుగా చూపించారు అంటూ నితేష్ తివారీపై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయంపై సీరియల్ నటి దీపిక కూడా స్పందించారు.

ALSO READ:హీరో దర్శన్ కు భారీ ఊరట.. కోర్ట్ గ్రీన్ సిగ్నల్!

ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు.. దీపికా

Advertisement

రామాయణంలో ఇలాంటి సన్నివేశం తనకు గుర్తు లేదని, తాను కూడా సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చూశాను అంటూ పేర్కొన్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. “ఇప్పటికే నేను వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామాయణం విన్నాను. నాకు గుర్తున్నాయి కూడా.. అసలు దీని గురించి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇలాంటి సన్నివేశాలు ఎక్కడా కూడా చూపించినట్లు నాకు గుర్తులేదు. మీరు గమనిస్తే మన దేశంలో సుమారుగా 300కు పైగా రామాయణాలు ఉన్నాయి ప్రతి కథ, ప్రతి రామాయణం కొంతమేరకు ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది .బహుశా నిర్మాతలు ఇలాంటి భాగాన్ని మరేదైనా రామాయణం నుండి తీసుకొని ఉండవచ్చు. దాని గురించి నాకు తెలియదు” అంటూ దీపిక చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమెను నితేష్ తివారి రామాయణం చూశారా ?అని అడగగా.. వచ్చేవారం దీపావళి తర్వాత చూస్తాను. అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే దీపిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

దీపికా చిఖాలియా కెరియర్..

ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. అరుణ్ గోవిల్ హీరోగా నటించిన దీపిక చిఖాలియా కొత్త ‘నోటీస్’ కూడా ఇప్పుడు తెరపై కనిపిస్తోంది. ఓటీటీలో కూడా విడుదలయ్యింది.

Related News

లక్ష్మీదేవిలా మెరిసిన మృణాల్.. ఈ అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

హీరో దర్శన్ కు భారీ ఊరట.. కోర్ట్ గ్రీన్ సిగ్నల్!

బాక్సాఫీస్ దగ్గర రామాయణ వర్సెస్ సూర్య.. ఎవరి హవా వారిదే!

పెళ్లి బారాత్‌లో నాగదుర్గ డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

వెట్రిమారన్ సినిమాల్లో అలాంటి సీన్లు ఓకేనా? జాన్వీపై నెటిజన్ల సెటైర్లు

‘డ్రాగన్ ‘ క్లైమాక్స్ కోసం మాస్టర్ ప్లాన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో అప్డేట్ రెడీ..!

Big Stories

Advertisement
×