BigTV English
Advertisement

Nikki Tamboli: 1000 కారణాలు అంటూ బ్రేకప్ పై తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్!

Nikki Tamboli: 1000 కారణాలు అంటూ బ్రేకప్ పై తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్!

Nikki Tamboli..ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు సడన్గా ప్రేమలో పడి , అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో కొంతమంది సహజీవనం చేసి పెళ్లి వరకు వెళ్తే.. మరికొంతమంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. అయితే అలా బ్రేకప్ చెప్పుకోవడానికి కారణాలు మాత్రం బయట పెట్టడం లేదు. కానీ ఇక్కడ ఒక తెలుగు హీరోయిన్ మాత్రం తన ప్రియుడు నుండి విడిపోవడానికి వెయ్యి కారణాలు అంటూ సంచలన నిజాలు బయటపెట్టింది.. ఆమె ఎవరో కాదు నిక్కీ తంబోలి (Nikki Tamboli).


ప్రియుడితో బ్రేకప్ పై స్పందించిన నిక్కీతంబోలి..

బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ తర్వాత కాంచన 3 , తిప్పరా మీసం వంటి సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం పంజాబీ లో ‘బద్నాం’ అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సినిమాలలో పెద్దగా నటించకపోయినా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఈ చిన్నది. ఇక నిత్యం తన బాయ్ ఫ్రెండ్ అర్భాజ్ (Arbaz patel) తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాయ్ ఫ్రెండ్ పై ఊహించని కామెంట్లు చేసింది.


1000 కారణాలు.. కానీ

ఇక దీంతో ఈమె తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పింది అంటూ వార్తలు రాగా.. మళ్లీ దీనిపై ఆమె స్పందించింది. నిక్కీ తంబోలి మాట్లాడుతూ..” అర్భాజ్ కి షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ. చిన్న విషయమైనా చాలు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతాడు. అందుకే ఎన్నోసార్లు అతడికి బ్రేకప్ చెప్పేయాలి అనిపించింది. అటు అర్భాజ్ ను వదిలేయడానికి నా దగ్గర వెయ్యి కారణాలు ఉన్నాయి. కానీ నేను వదులుకోను. ఎందుకంటే నేను ఎమోషనల్ గా వీక్ ఉన్న సమయంలోనే కాదు ప్రతి సమయంలో కూడా నాకు చాలా సపోర్ట్ గా నిలిచాడు. నేను బాధలో ఉన్నప్పుడు నాకోసం అండగా నిలిచిన ఏకైక వ్యక్తి అర్భాజ్ మాత్రమే. అందుకే ఎంత కష్టం వచ్చినా.. ఎన్ని కారణాలు ఉన్నా.. నా బాయ్ ఫ్రెండ్ ని మాత్రం నేను వదులుకోను” అంటూ అసలు విషయం తెలిపింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే నరకమైన చూస్తాను కానీ బాయ్ ఫ్రెండ్ ను మార్చను అని స్పష్టం చేసింది.

నెటిజన్స్ ప్రశంసలు..

ఇకపోతే ఈమె చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే ఎంతటి వారైనా సరే జీవితంలో సక్సెస్ అవుతారు. ఇక నువ్వు కూడా అంతే.బ్రేకప్ చెప్పడానికి వెయ్యి కారణాలు ఉన్న తననే బాయ్ఫ్రెండ్ గా కోరుకుంటున్నావు అంటే నీది నిజమైన ప్రేమ అంటూ నిక్కీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే నిక్కీ తంబోలి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also read: Bigg Boss: చెత్త రేటింగ్..హోస్ట్ పై భారీ దెబ్బ..ఏకంగా సగానికి పడిపోయిన రెమ్యూనరేషన్!

Related News

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Big Stories

×