Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss).. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో. ఎక్కడో పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు అన్ని భాషలలో ప్రసారమవుతోంది. ఇదిలా ఉండగా తెలుగులో 9వ సీజన్ కి సిద్ధమవుతున్న ఈ షో.. అటు హిందీలో కూడా 19వ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆ భాషలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త రేటింగ్ అని కామెంట్స్ చేయడమే కాకుండా ఆ దెబ్బ ఇప్పుడు హోస్ట్ పై పడిందని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ షోకి తగ్గుతున్న రేటింగ్..
బిగ్ బాస్ రియాల్టీ షో కి ఉన్న క్రేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ షోని ముందుకు నడపడంలో హోస్ట్ దే ప్రధాన పాత్ర. అటు కంటెస్టెంట్స్ తప్పులను చెప్పడానికి, వారిని సరిదిద్దడానికి, వీకెండ్ లో ఎంటర్టైన్మెంట్ అందివ్వడానికి హోస్ట్ కీలకపాత్ర పోషిస్తారు. అలాంటి ఈ షో కి ఒకప్పుడు ఊహించని గుర్తింపు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో రాను రాను క్రేజ్ కోల్పోతూ వస్తోంది. అటు టీఆర్పీ రేటింగ్ లో కూడా భారీ డౌన్ ఫాల్ నమోదు చేస్తోంది. ఇక అందులో భాగంగానే హిందీ బిగ్ బాస్ మేకర్స్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇన్ని సంవత్సరాలుగా హిందీ బిగ్ బాస్ షో ని ముందుకు నడిపిస్తున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) కి బిగ్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
2006లో హిందీలో బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభించారు. అర్షద్ వార్షీ వ్యవహరించగా.. మూడవ సీజన్లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ గా చేశారు. ఇక నాలుగవ సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) షోని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రియాల్టీ షో ని టాప్ రేటెడ్ షోగా తీర్చిదిద్దిన ఘనత సల్మాన్ ఖాన్ కి దక్కుతుంది. అంతే కాదు సీజన్స్ పెరుగుతున్న కొద్దీ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వచ్చారు. అలా 18 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో కి చివరిసారిగా ఏకంగా రూ. 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే నెక్స్ట్ సీజన్ కి రూ.250 కోట్లు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆడియన్స్.
దెబ్బకు సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ కి భారీ గండి….
అయితే ఇప్పుడు మాత్రం భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ 18 కి పరమ చెత్త అనే కామెంట్ వచ్చింది. అటు టిఆర్పి రేటింగ్ లో కూడా చాలా వెనుకబడిపోయింది. ఆ ఎఫెక్ట్ సీజన్ 19 పై పడిందని చెప్పాలి. అందుకే బిగ్ బాస్ మేకర్స్ కూడా బడ్జెట్లో కోత పెట్టేందుకు ఫిక్స్ అయ్యారు. మొదట రూ.200 కోట్లు రెమ్యూనరేషన్తో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ కి.. ఇప్పుడు రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారటఅటు సల్మాన్ ఖాన్ కూడా తప్పని పరిస్థితుల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ ఒకవేళ ఇదే నిజమైతే హోస్ట్ రెమ్యునరేషన్ కి భారీ గండి పడబోతోంది అని చెప్పవచ్చు.