Telugu Hero Movie : బెల్లం చూట్టు ఈగలు ఉంటాయనే సామేత విన్నారా… సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే సామేత లానే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. హీరో గానీ డైరెక్టర్ గానీ ఒక్క హిట్ కొట్టారంటే… వాళ్లు చూట్టు అవకాశాలు వస్తాయి. ఒక వాళ్లు ఫెయిల్ కంటెంట్ చేస్తే, వారి పరిస్థితి మొత్తం తలకిందులు అయిపోతుంది. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది.
వరుస ప్లాప్స్‌ల్లో ఉన్న ఓ హీరో… వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్న డైరెక్టర్ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. వారికి అండగా ఓ బడా ప్రొడ్యూసర్ సంస్థ కూడా ముందుకు వచ్చిందట. ఆ హీరో ఎవరో… ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇక్కడ వరుస ప్లాప్స్‌ల్లో ఉన్న హీరో అంటే… నితిన్. భీష్మ తర్వాత గత ఐదేళ్ల నుంచి వరుస పెట్టి సినిమాలు చేసినా… నితిన్‌కు ఒక్కటి అంటే ఒక్క హిట్ రాలేదు. ఈ మధ్య వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్ల పడ్డాయి. ఈ రెండు సినిమాల ఫెయిల్ అయిన తర్వాత నితిన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు.
ముందే సైన్ చేసిన ఎల్లమ్మ మూవీ కూడా నితిన్ చేతుల్లో నుంచి వెళ్లిపోయిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఉంది. దీని తర్వాత నితిన్ వైపు డైరెక్టర్లు ఎవరూ కూడా తొంగి చూడలేదు అని ఇండస్ట్రీలో జనాలు అంటున్నారు.
అయితే, ఇప్పుడు ఈ హీరో దగ్గరకి ఓ డైరెక్టర్ వచ్చాడట. అతనే వరుసగా డిజాస్టర్లను ఎదుర్కొంటున్న డైరెక్టర్. అతను ఎవరో కాదు… శ్రీను వైట్ల. ఈ డైరెక్టర్ కి సరైన హిట్ లేక దాదాపు 14 ఏళ్లు అవుతుంది. 2011 లో వచ్చిన దూకుడు మూవీ మంచి విజయాన్ని సాధించింది. దీని తర్వాత శ్రీను వైట్లకు అంతటి హిట్ మళ్లీ దొరకలేదు. ఇటీవల వచ్చిన మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోని, విశ్వం సినిమాలైతే బిగ్ డిజాస్టర్లు అయ్యాయి.
అలాంటి ఈ ఇద్దరు టీమ్ అప్ అవుతున్నారని తెలుస్తుంది. ఓ స్టోరీని నితిన్‌కు శ్రీను వైట్ల చెప్పారట. నితిన్ వెంటనే ఒకే చేశారట. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని సమాచారం. ఇద్దరు ప్లాప్స్‌లో ఉన్నారు.. ఇద్దరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి.. ఈ సినిమా వారి కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్ అయితే, ఇద్దరు కంబ్యాక్ ఇచ్చినట్టే.
ఒకవేళ సినిమా ఎప్పటిలానే ఫెయిల్యూర్ అయితే, ఇప్పటికే దారుణంగా ఉన్న వీళ్ల కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చూడాలి మరి… వీరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో…