Film industry:ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. అందుకే బడ్జెట్ ఎక్కువ పెట్టిన చిత్రాల కంటే కూడా కథా, కంటెంట్ ఎక్కువగా ఉండే చిత్రాలకే ప్రజలు ఓటేస్తున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా వచ్చిన చిన్న చిత్రాలు కూడా ఇప్పుడు సత్తా చాటుతూ థియేటర్ వద్ద దూసుకుపోతున్నాయి. అలా ఇప్పటివరకు బడా చిత్రాలకు పోటీగా వచ్చి సక్సెస్ సాధించిన చిన్న చిత్రాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను అందించిన చిత్రాలపై ఒక లుక్కేద్దాం..
ఈ ఏడాది విడుదలైన తక్కువ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అందులో మొదటిది
సంక్రాంతికి వస్తున్నాం..
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో.. వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ . ఇందులో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) తో పాటు ప్రముఖ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 14న విడుదలైన ఈ సినిమా కేవలం రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి.. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.303 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి పోటీగా వచ్చిన రామ్ చరణ్ (Ram Charan) ‘ గేమ్ ఛేంజర్’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి, ఘోర డిజాస్టర్ ను చవిచూసింది.
మహావతార్ నరసింహ..
నటీనటులకు అవకాశం కల్పించకుండా.. కేవలం యానిమేషన్ తో రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం మహావతార్ నరసింహ. యానిమేషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ రన్ ముగిసేసరికి రూ.315 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాదు నటీనటులు లేకపోయినా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ సినిమా నిరూపించింది.
సైయారా..
అనన్య పాండే (Ananya Pandey) సోదరుడు అహాన్ పాండే తొలి పరిచయంలో విడుదలైన చిత్రం సైయారా. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.569 కోట్లు రాబట్టి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి యువత ఎంతలా కనెక్ట్ అయ్యింది అంటే థియేటర్లలోనే ఏడ్చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తుడరుమ్..
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తుడరుమ్. ఈ సినిమా కూడా రూ.35 కోట్ల బడ్జెట్ తెరకెక్కి ఏకంగా రూ.235 కోట్లు రాబట్టింది.
కొత్తలోక..
తొలిసారి లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మళయాల చిత్రం లోకా చాప్టర్ వన్: చంద్ర. దీనిని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం రూ.30 కోట్లతో తెరకెక్కగా.. ఏకంగా రూ.185 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు త్వరలో రూ.200 కోట్ల క్లబ్లో కూడా ఈ సినిమా చేరబోతోంది. ఇలా కంటెంట్ ఉంటే చాలు బడ్జెట్ తో అవసరం లేదని చాలా చిత్రాలు నిరూపిస్తున్నాయి.
ALSO READ:Tollywood: వ్యాపారవేత్తలకు అల్లుళ్ళుగా మారిన టాలీవుడ్ హీరోలు వీరే!