E-Paper
Advertisement

నాని నా బెస్ట్ ఫ్రెండ్.. 20 ఏళ్ల స్నేహంపై నితిన్ ఎమోషనల్ కామెంట్స్!

నాని నా బెస్ట్ ఫ్రెండ్.. 20 ఏళ్ల స్నేహంపై నితిన్ ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Nithiin:వరుస ప్లాప్పులతో డీలా పడ్డ నితిన్ తాజాగా ‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయిపోయాడు.ఇక ఈ సినిమా వచ్చే డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుందన్న సంగతి తెల్సిందే.ఇదిలా ఉండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో నితిన్ నాని గురించి చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

తనకంటే వయసులో, కెరీర్‌లో చిన్నవాడైన నాని బ్యానర్‌లో సినిమా సినిమా చేయడంపై నితిన్ మాట్లాడుతూ నాని, తాను దాదాపు 20 ఏళ్లుగా మంచి స్నేహితులమని, 2006లో ‘అల్లరి బుల్లోడు’ సినిమా సమయంలో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే తమ పరిచయం ఉందని గుర్తుచేసుకున్నాడు.ఇక తాను ఎప్పుడూ సీనియర్, జూనియర్ అనే తేడాలు చూడనని, నాని ఒక కథ పంపించాడంటే అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని నమ్ముతానని అన్నారు.

Advertisement

ఈ కథ వినగానే బాగా నచ్చడంతో ఎలాంటి లెక్కలు వేసుకోకుండా వెంటనే ఓకే చెప్పేశానని నితిన్ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్గురించి చెబుతూ పూర్తి స్క్రిప్ట్ ముందే రెడీ అయిపోవడంతో ఆగస్టు 17న షూటింగ్ మొదలుపెట్టి, కేవలం 48 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశామని చెప్పుకొచ్చాడు

మొత్తం 108 రోజుల ప్లానింగ్‌తో డిసెంబర్ 4న సినిమాను రిలీజ్ చేస్తున్నామని, ఇంత తక్కువ రోజుల్లో తీసినా తెరపై క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.

Advertisement

తన కెరీర్‌లో ఇప్పటివరకు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ, కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేశానని, కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా చేయడం ఇదే మొదటిసారని తెలిపాడు.ఇక ఇందులో తాను పోషించిన కృష్ణ పాత్ర తనకు బాగా దగ్గరైందని, షూటింగ్ అయిపోయినా ఆ పాత్ర కోసం వాడిన కళ్లద్దాలను ఇప్పటికీ పెట్టుకుంటున్నానని సరదాగా చెప్పుకొచ్చాడు నితిన్.

ఇక దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ, ఈ కథను ముందు వేరే హీరో కోసం అనుకున్నా, నాని సలహాతో నితిన్‌కు వినిపించామని చెప్పారు. నితిన్ ఒక్క మార్పు కూడా చెప్పకుండా వెంటనే ఓకే చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

అలాగే తమ గత సినిమా ‘దండోరా’కు సెన్సార్ ఇబ్బందులు ఎదురైనా, ‘అలియాస్ రుక్మిణి’కి మాత్రం ఒక్క కట్, మ్యూట్ కూడా లేకుండా సెన్సార్ క్లియర్ కావడం విశేషమని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఇక ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న హీరోయిన్ ఆఫియా సయ్యద్ మాట్లాడుతూ , నితిన్ లాంటి స్టార్ హీరోతో పనిచేయడం మంచి అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. చూడాలి మరి డిసెంబర్ 4 న రిలీజ్ అవుతున్న ‘అలియాస్ రుక్మిణి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో !

also read:సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

Tags

Related News

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి పేరు కూడా రివీల్!

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!

75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!

కుండబద్దలు కొట్టిన అనంత శ్రీరామ్.. ‘పెద్ది’ వివాదంపై సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×