Harshit Rana Abuse Shahbaz Ahmed: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) తొలి సెమీస్ లో టీమిండియా, శ్రీలంక జూనియర్ జట్లు (Sri Lanka A vs India A, 1st Semi-Final (A1 v B2)) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శ్రీలంక సూపర్ విక్టరీ అందుకుని, ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే, ఈ మ్యాచ్ లోనూ హర్షిత్ రాణా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ షహబాజ్ అహ్మద్ ను హిందీలో బూతులు తిట్టి, అడ్డంగా హర్షిత్ రాణా దొరికిపోయాడు. హర్షిత్ రాణా వేసిన ఓ బంతిని లెగ్ సైడ్ వైపు శ్రీలంక బ్యాటర్ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు.
ఈ తరుణంలోనే దూరంగా నుంచి పరుగెత్తి మరీ, బంతిని షహబాజ్ అహ్మద్ ( Shahbaz Ahmed) ఆపాడు. త్రో వేయడంలో కాస్త ఆలస్యం చేసినందుకు షహబాజ్ అహ్మద్ ను హర్షిత్ రాణా బూతులు (Harshit Rana Abuse) తిట్టాడు. హిందీలో కుటుంబ సభ్యులను ఉద్దేశించి తిట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్ లోనూ ఇలాగే ఓవరాక్షన్ చేసి, టీమిండియాను ఓడించాడని.. ఇప్పుడు తోటి ప్లేయర్ ను బండ బూతులు తిట్టాడంటూ ఆగ్రహిస్తున్నారు. గంభీర్ శిష్యుడైన హర్షిత్ రాణాపై కచ్చితంగా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని, కనీసం మూడు మ్యాచ్ లు ఆడకుండా బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి సెమీస్ జరిగింది. గురువారం దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియానే మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 50 ఓవర్లు ఆడిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. ఈ టార్గెట్ ను శ్రీలంక ప్లేయర్లు అవలీలగా ఛేదించారు. లంక ఓపెనర్లు లసిత్ క్రూస్‌పుల్లే, సినెత్ జయవర్ధనే ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఈ తరుణంలోనే 41.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి లంక విజయం సాధించింది. దీంతో ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఫైనల్ లో పాక్ లేదా బంగ్లాతో లంక తలపడనుంది.
🔴HARSHIT RANA LITERALLY ABUSING HIS TEAM-MATES 😭
Harshit🎙️: BC Shahbaz pakad na 🥀 pic.twitter.com/9LY5MYThva
— Sam (@cricsam02) November 26, 2026