E-Paper
Advertisement

రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పిన శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి.. ఎందుకంటే!

రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పిన శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి.. ఎందుకంటే!
Advertisement

Disco Shanthi: డిస్కో శాంతి పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో సినిమాలలో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా డిస్కో శాంతి ఉండాల్సిందే.. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలలో అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న డిస్కో శాంతి(Disco Shanthi) ప్రముఖ నటుడు శ్రీహరిని(Srihari)వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత సినిమాలను కాస్త తగ్గించిన డిస్కో శాంతి శ్రీహరి మరణం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఇటీవల శ్రీహరి కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ డిస్కో శాంతి జీవనం గడుపుతున్నారు.

రామ్ చరణ్ కు డిస్కో శాంతి క్షమాపణలు..

ఇదిలా ఉండగా ఇటీవల డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డిస్కో శాంతి ప్రముఖ నటుడు రామ్ చరణ్(Ram charan) కు క్షమాపణలు తెలియజేశారు. అసలు డిస్కో శాంతి రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పడం ఏంటి? ఈ క్షమాపణలు వెనుక గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర (Magadheera)సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మగధీరలో అతిథి పాత్ర వద్దని చెప్పాను..

Advertisement

ఈ సినిమాలో శ్రీహరి కూడా కీలక పాత్రలో కనిపించారు. అయితే రామ్ చరణ్ సినిమాలో శ్రీహరి అతిథి పాత్రలో నటించడం ఇష్టం లేనటువంటి డిస్కో శాంతి మగధీర సినిమాలో నటించొద్దు అంటూ శ్రీహరికి చెప్పారట. అప్పటివరకు శ్రీహరి తనకు మగధీర కథ చెప్పకపోవడంతో ఈమె అతిథి పాత్రలో నటించాల్సిన అవసరం లేదు .ఒకవేళ రాజమౌళి సినిమాలో మీరు హీరో అయితే పర్వాలేదు కానీ, అతిథి పాత్ర అయితే వద్దని చెప్పానని అందుకు నన్ను క్షమించు అంటూ ఇప్పుడు ఈమె క్షమాపణలు చెప్పారు. మగధీర సినిమాలో బావ పాత్ర ఎంత కీలకంగా ఉందో సినిమా చూసిన తర్వాతనే నాకు తెలిసిందని డిస్కో శాంతి తెలిపారు.

శ్రీహరి పాత్ర లేకపోతే సినిమానే లేదు..

Advertisement

మగధీర సినిమా చూసిన తర్వాత శ్రీహరి గారి పాత్ర లేకపోతే సినిమానే లేదని విషయం నాకు తర్వాత అర్థం అయిందని, రాజమౌళి గారు బావ కోసం చాలా అద్భుతమైన పాత్రను ఇచ్చారు అంటూ ఈ సందర్భంగా డిస్కో శాంతి మగధీర సినిమా గురించి అందులో శ్రీహరి నటించిన గురించి మాట్లాడుతూ రాంచరణ్ కు క్షమాపణలు చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీహరి హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అదేవిధంగా పలు సినిమాలలో కీలకపాత్రలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న శ్రీహరి 2013 వ సంవత్సరంలో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇలా శ్రీహరి మరణించడంతో డిస్కో శాంతి తన పిల్లలు పూర్తిగా ఇండస్ట్రీకి కనుమరుగయ్యారు. ఇటీవలే శ్రీహరి పెద్ద కుమారుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే.

Also Read: హేమక్క తప్పు చేశాను క్షమించు… బిగ్ బాస్ తమన్నా సింహాద్రి కామెంట్స్ వైరల్!

Related News

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×