BigTV English
Advertisement

Prithviraj Sukumaran: అందుకే నేషనల్ అవార్డు ఇవ్వలేదు.. ఆడుజీవితం మూవీపై జ్యూరీ మెంబర్ రియాక్షన్

Prithviraj Sukumaran: అందుకే నేషనల్ అవార్డు ఇవ్వలేదు.. ఆడుజీవితం మూవీపై జ్యూరీ మెంబర్ రియాక్షన్

Prithviraj Sukumaran:2025 ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ ఫిలిం అవార్డ్స్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పేరు లేకపోవడంపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకి నేషనల్ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ ‘జవాన్’ మూవీలో నటించిన షారుక్ ఖాన్ (Shahrukh Khan) కి నేషనల్ అవార్డు రావడం పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు 10th fail మూవీలో నటనకి విక్రాంత్ మాస్సే (Vikranth Massey) కి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


పృథ్వీరాజ్ సుకుమారన్ కి నేషనల్ అవార్డు రాకపోవడం పై ఫ్యాన్స్ అసహనం..

ఇకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ కి కనీసం వచ్చే ఏడాది అయినా నేషనల్ అవార్డు వస్తుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కూడా అది జరగకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ నటనకు నేషనల్ అవార్డు రాకపోవడంపై.. నేషనల్ అవార్డు సినిమాలను ప్రకటించిన 11 మంది ప్యానెల్ సభ్యులలో ఒకరైన జ్యూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ స్పందించారు. జాతీయ అవార్డుల ఎంపికపై సంచలన విషయాలను బయటపెట్టి పలు రూమర్స్ కి చెక్ పెట్టారు.


ది కేరళ స్టోరీ అవార్డ్స్ పై కూడా స్పందించిన జ్యూరీ మెంబర్స్..

జ్యూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ మాట్లాడుతూ.. ప్యానెల్ లో మలయాళీ మూవీగా నిలిచిన ది కేరళ స్టోరీ మూవీకి అవార్డులు ఇవ్వడ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాను. ఒక రాష్ట్రాన్ని కించపరిచే విధంగా తీసిన సినిమాకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారని కూడా నేను ప్రశ్నించాను.. జ్యూరీ చైర్ పర్సన్ కి నా అభిప్రాయాలు కూడా తెలియజేశాను. కానీ వారు నా అభిప్రాయాన్ని ఎవరూ కూడా లెక్క చేయలేదు. పైగా ఈ ది కేరళ స్టోరీ సినిమాలో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయని, ఓ ఉద్దేశంతో తెరకెక్కించిన సినిమా అని , నా అభిప్రాయాన్ని కూడా తెలియజేశాను. కానీ వారు మాత్రం అది ఒక సామాజిక సమస్యగా భావించారు.

నటనలో సహజత్వం లేదంటూ క్లారిటీ ఇచ్చిన జ్యూరీ మెంబర్..
ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా బెస్ట్ యాక్టర్ ఇవ్వాలని నేను ప్రతిపాదన పెట్టాను. అటు గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లో ది గోట్ లైఫ్ సినిమాని కమిటీ చైర్ పర్సన్ అషుతోష్ కూడా చూశారు. కానీ ఆయన ఇందులో సామాజిక అంశం లేదని, పృథ్వీరాజ్ నటనలో సహజత్వం లేదని తెలిపారు. అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే ఆ చిత్రానికి నేషనల్ అవార్డు ఇవ్వలేదు అంటూ జ్యూరీ మెంబర్ తెలిపారు. ఇక మొత్తానికైతే ఇంత గొప్ప సినిమాకి కూడా నటనలో సహజత్వం లేదని అవార్డు ఇవ్వ కపోవడం పై అటు జ్యూరీ మెంబర్ మాత్రమే కాదు ఇటు అభిమానులు కూడా జ్యూరీ మెంబర్స్ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి గొప్ప నటుడికి నేషనల్ అవార్డు ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పవచ్చు.

also read:Telugu Film Awards : ఇండస్ట్రీకి గుడ్ న్యూస్.. మరిన్ని అవార్డులు వస్తున్నాయి!

Related News

The Girl Friend Censor : మూవీలో దారుణమైన లిప్ కిస్ సీన్స్… కత్తిరించేసిన సెన్సార్..

Manchu Manoj: రాజ్యం లేదు కానీ రాణిలా చూసుకుంటా.. మనసును హత్తుకుంటున్న మనోజ్ మాట!

Dance master: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు..మరీ ఇంత దారుణమా?

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Big Stories

×