Telugu Film Awards : సినిమా ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేష సేవ చేస్తున్న కళాకారులకు అవార్డులు ప్రధానోత్సవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా అవార్డ్స్ వేడుక ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’, ‘సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025’ వేడుక ఈనెల 16వ తేదీన హైదరాబాదులో చాలా అట్టహాసంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఈ అవార్డ్స్ కి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది.
త్వరలో ఏపీలో కూడా అవార్డులు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్(Murali Mohan)మాట్లాడుతూ.. ఏపీకి కూడా అవార్డులు వస్తాయని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ” గత 24 సంవత్సరాలుగా అవార్డుల వేడుక చేస్తున్న ఏకైక మ్యాగజైన్ సంతోషం(Santhosham awards)మాత్రమే. సురేష్ కొండేటి (Suresh Kondeti) ఒక్కరే ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ వేడుకను ఘనంగా ముందుకు తీసుకెళుతున్నారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉంది. త్వరలో ఏపీలో కూడా ఫిలిం అవార్డులు ఇవ్వనున్నారు. ఏపీకి కష్టాలు వచ్చినందుకు సురేష్ కి ఎటువంటి ఇబ్బంది కలగదు. కచ్చితంగా ఈ ఫిలిం అవార్డ్స్ ని ప్రకటిస్తాము” అంటూ మురళీమోహన్ తెలిపారు.
ఫిలిం అవార్డ్స్ రేంజ్ లో గుర్తింపు..
ఇక అలాగే 2002లో తొలి సంతోషం అవార్డుల వేడుక జరిగినప్పుడు.. నాగార్జున ఇది ఫిలిం అవార్డ్స్ లా పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఆయన మాట మీద నేను కనీసం 25 ఏళ్లు అయినా ఈ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది 24వ సంవత్సరం. అందరి ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాతోపాటు నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సురేష్ కొండేటి తెలిపారు. ఇంకా ఈ అవార్డుల కార్యక్రమానికి శ్రీ విజయ వారాహి మూవీస్ సంస్థ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మొత్తానికి అయితే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ప్రకటించి.. విశేష సేవ అందించిన నటీనటులకు గద్దర్ అవార్డ్స్ అందించారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇక్కడ విశేష సేవ అందించిన నటీనటులకు ఫిలిం అవార్డ్స్ అందివ్వబోతున్నారని తెలిసి అభిమానులు, సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కళాకారుల ప్రోత్సాహం కోసమే ఈ అవార్డులు..
ఇకపోతే ఈ అవార్డులు అనేవి కళాకారులను ప్రోత్సహించడానికే అంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా డబ్బు వస్తోంది కదా పనిచేస్తున్నాము అంటే సరిపోదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి. సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పటికే ఎంతోమంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు తమ వంతు ప్రయత్నంగా కష్టపడి సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి గొప్ప విశేష సేవను చేస్తున్న వారందరినీ గుర్తించి , ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి అవార్డుల ప్రధానోత్సవం అనేది కళాకారుల ప్రోత్సాహానికి మంచి పునాది అని చెప్పవచ్చు.
also read: Kiran abbavaram: ఫైనల్ గా కొడుకును పరిచయం చేసిన హీరో కిరణ్ అబ్బవరం.. పేరు ఏంటంటే ?