Annadata Sukhibhav Scheme: ఏపీ రైతులకు మరొక వార్త. అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులు రాలేదా? ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే నేరుగా వ్యవసాయ శాఖ అధికారులను కలిసి అన్ని వివరాలు చూపిస్తే, తక్షణమే మీ అకౌంట్లో నిధులు పడతాయి? ఎలా చేయాలి? ఏం చేయ్యాలి? అనేదానిపై ఈ కింది విషయాలపై ఓ లుక్కేద్దాం.
ఏపీలో వ్యాప్తంగా ఆగష్టు రెండున అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి. 99.98 శాతం మందికి నగదు జమ అయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. చాలామంది రైతులు మాత్రం డబ్బులు పడలేదని చెబుతున్నారు. అయితే కొందరికి డబ్బులు పడకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు.
ఈ-కేవైసీ తప్పని సరిగా చేయాలని, చేయకుంటే నిధులు జమ కావని చెప్పారు.
ఎన్పీసీఐ-NPCI యాక్టివ్‌గా లేకపోవడం లేకుంటే మ్యాపింగ్ లేకపోవడం మరో కారణంగా చెప్పారు.
వెరిఫికేషన్ సమయంలో పరిశీలన ఉన్న కొంతమంది రైతులను తిరస్కరించడం ఇంకో కారణం
ALSO READ: జగన్‌పై ఎదురుదాడి.. ఇక దూరం పెట్టినట్టేనా?
ఈ- కేవైసీ అందరికీ ప్రభుత్వం మ్యాపింగ్ చేయలేదు. కొంతమందికి పెండింగ్ ఉందని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. అలాంటివారు వెంటనే రైతు సేవ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలి. ఎన్పీసీఐ ఆక్టివ్, మ్యాప్ అయిందా లేదా అనే విషయాలను బ్యాంకుకి వెళ్లి నిర్ధారించుకోవాలి. లేకపోతే బ్యాంకు వెళ్లి సరిచేసుకోవాల్సి ఉంటుంది.
వెరిఫికేషన్ టైమ్‌లో తిరస్కరణకు గురైన కారణాలు ఇవే. పరిశీలన సమయంలో భూ యజమాని మరణించినట్లు గుర్తించినా, వారసులకు పాసు పుస్తకాల జాప్యం ఉన్నందున తిరస్కరించారు. సాగు భూమికి ఆధార్ అనుసంధానంతో తప్పులు ఉన్నా, న్యాయపరమైన సమస్యలున్నా తిరస్కరించడం జరిగింది.
మరో ముఖ్యమైన విషయం ఆక్వా-వ్యవసాయేతర భూములకు వర్తించదు. నెలకు 20 వేలు తీసుకునే ఉద్యోగస్తులు, పది సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్నా అనర్హులుగా పెట్టిన విషయం తెల్సిందే. మిగతా వివరాలు కావాలంటే సమీపంలోని వ్యవశాయ శాఖ అధికారులను సంప్రదించాలి.