Daughters Features: పిల్లలకు తల్లింద్రుడుల పోలికలు రావడం అనేది కామన్. అమ్మాయిల విషయంలో తల్లితో పోల్చితే తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ముఖ భాగాలు, ఎత్తు లాంటి అంశాలు సేమ్ టు సేమ్ వచ్చేస్తాయి. నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి 50% జన్యువులను పొందుతారు. కొన్నిసార్లు, కొన్ని జన్యువులు ఇతరులకంటే బలంగా ఉంటాయి. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులలో ఒకరి పోలికలను ఎక్కువగా పొందుతారు. అమ్మాయిలు వారి తండ్రి X క్రోమోజోమ్‌ను పొందుతారు. సో, తండ్రిలోని కొన్ని లక్షణాలు అమ్మాయిలలో ఎక్కువగా కనిపిస్తాయి.
ఆడపిల్లలకు వచ్చే తండ్రి లక్షణాలు
ఆడపిల్లలకు తండ్రి నుంచే వచ్చే లక్షణాలు జన్యువులతో పాటు పెంపకం, సామాజిక పరిసరాలపై ఆధారపడతాయి. ఈ పోలికలు శారీరక లక్షణాలు, వ్యక్తిత్వం, ఆసక్తులు, ఆలోచనా విధానాలలోనూ కనిపిస్తాయి.
⦿ శారీరక పోలికలు: ముఖ్యంగా ముఖ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళ్ళు, ముక్కు, జుట్టు రంగు, ఆకారం తండ్రిలా ఉంటుంది. శరీర నిర్మాణం అంటే, ఎత్తు, బరువు, శరీర ఆకారం కూడా తండ్రిలాగే ఉంటుంది. కొన్నిసార్లు వాయిస్, నడక కూడా తండ్రిలాగే ఉంటాయి.
⦿ వ్యక్తిత్వ లక్షణాలు: సమస్యలను పరిష్కరించే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు , పిల్లల స్వభావం, ప్రవర్తన కూడా తల్లిదండ్రుల నుండి సంక్రమించవచ్చు. కొన్నిసార్లు, అమ్మాయిలు తమ తండ్రి స్వభావం, ప్రవర్తనను పోలి ఉండవచ్చు. సౌమ్యత, కోపం, ఓర్పు, హాస్యం, సృజనాత్మకత లాంటి లక్షణాలు అమ్మాయిలో కనిపిస్తాయి.
⦿ ఆసక్తులు, అలవాట్లు: తండ్రి ఇష్టా ఇష్టాలు అలవాట్లు కూడా అమ్మాయిలకు వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి ఇష్టపడే గేమ్స్, మ్యూజిక్ లేదంటే హాబీలు ఆడపిల్లలో కనిపించవచ్చు. ఆహార అలవాట్లు, పని విధానం, రోజు వారీ జీవనశైలి కూడా తండ్రిలాగే ఉంటుంది.
⦿ జన్యు ప్రభావం: జన్యు ప్రభావం ద్వారా అమ్మాయిలకు కొన్ని లక్షణాలు తండ్రి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మెమరీ పవర్, ఆరోగ్య సంబంధిత లక్షణాలు తండ్రి నుంచి ఆడ పిల్లకు వస్తాయి. కొన్ని వ్యాధులు, శారీరక లక్షణాలు కూడా వంశపారంపర్యంగా వస్తాయి.
⦿ పెంపకం, పరిసరాలు: తండ్రితో గడిపిన సమయం వల్ల ఆడపిల్లలు అతని మాటలు, ప్రవర్తన, విలువలను అనుకరించవచ్చు. తండ్రి జీవనశైలి, నీతి విలువలు ఆడపిల్లలో ప్రతిబింబించవచ్చు.
Read Also: ఓర్నీ.. ఉద్యోగుల కోసం చీర్ లీడర్స్.. చైనా కంపెనీ ప్రయోగం అదుర్స్!
మొత్తంగా అమ్మాయిలలో చాలా లక్షణాలు తండ్రి నుంచే పొందే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తల్లిపోలికలు, లక్షణాలను కూడా పునికిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ లక్షణాలు అనేవి ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడుతాయంటున్నారు నిపుణులు.
Read Also: 6 నిమిషాలు.. చీకటి గుప్పిట్లో ప్రపంచం, ఆగష్టు 2న ఏం జరగబోతోందంటే?