Mega Family on HHVM: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి(Mega Family) ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. మెగా కుటుంబ సభ్యులు కూడా ఆ సినిమాకు పూర్తిస్థాయిలో వారి మద్దతు తెలియజేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై మెగా కుటుంబం మౌనంగా ఉండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో…
పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా ద్వారా కనిపించి సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు చాలా స్పెషల్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం(Deputy Cm) అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా కావటం విశేషం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొణిదెల కుటుంబ గౌరవ మర్యాదలను జాతీయస్థాయిలో చాటి చెప్పారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి నటించిన సినిమా విడుదల అవుతుంటే మాత్రం ఇప్పటివరకు చిరంజీవితో సహా మొదలుకొని మెగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా స్పందించలేదు కేవలం సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)మాత్రమే సినిమా విడుదలకు ముందు సినిమా గురించి స్పందిస్తూ ట్వీట్ వేశారు.
మౌనంగా మెగా కుటుంబ సభ్యులు..
ఇలా సాయి ధరమ్ తేజ్ మినహా మిగిలిన ఎవరూ కూడా హరిహర వీరమల్లు సినిమా విషయంలో స్పందించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండి ఉంటే సినిమా పట్ల మరింత బజ్ పెరిగి ఉండేది కానీ ఈ సినిమా విషయంలో అందరూ మౌనంగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ కూడా తన బాబాయ్ సినిమా విషయంలో స్పందించకపోవడం గమనార్హం. ఈయన హరిహర వీరమల్లు గురించి స్పందించకపోయిన బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేయడంతో అభిమానులు చరణ్ తీరును విమర్శిస్తున్నారు.
సీక్వెల్ పై పెరిగిన అంచనాలు..
ఇక పవన్ కళ్యాణ్ మెగా హీరోల సినిమా విడుదలవుతుంది అంటే తన సినిమాగా భావించి ఆ సినిమాలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ను మెగా కుటుంబం ఒంటరిని చేసింది. ఇప్పటివరకైతే మెగా కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదు, మరి ఇప్పటికైనా హరిహర వీరమల్లు గురించి స్పందిస్తారా? లేదంటే లైట్ తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో సీక్వెల్ పై కూడా కాస్త అంచనాలు పెరిగాయి.
Also Read: Neha Chowdary: విడాకుల బాటలో నేహా చౌదరి..భర్తకు దూరంగా…ఫోటోలు డిలీట్?