IPL 2026-KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( IPL 2026) సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో మినీ వేలానికి సిద్ధమవుతున్నాయి 10 ఫ్రాంచైజీలు. ఈ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. దీంతో, ఏ ప్లేయర్ ను వదిలివేయాలి? ఏ ప్లేయర్ ను వేలంలో కొనుగోలు చేయాలి అనే దానిపైన కసరత్తులు మొదలుపెట్టాయి 10 ఫ్రాంచైజీలు. ఇలాంటి నేపథ్యంలో కేకేఆర్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హర్షిత్ రాణాకు కెప్టెన్సీ ఇవ్వాలని కేకేఆర్ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. గౌతమ్ గంభీర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుందట కేకేఆర్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ప్రతి విషయంలో వేలు పెడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్న గౌతమ్ గంభీర్, ఇప్పుడు హర్షిత్ రాణా కోసం తెగించారు. కేకేఆర్ జట్టు కెప్టెన్ గా హర్షిత్ రాణాను చేయాలని షారుక్ ఖాన్ కు సూచనలు చేశారంట గౌతమ్ గంభీర్. గతంలో గౌతమ్ గంభీర్ కేకేఆర్ కోచ్ గా పని చేశారు. అతని సారథ్యంలోనే పలుసార్లు కేకేఆర్ ఛాంపియన్ గా కూడా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏది చెబితే అది వింటోంది కేకేఆర్ యాజమాన్యం. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం కేకేఆర్ కెప్టెన్ గా హర్షిత్ రాణాను ఫైనల్ చేయాలని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారట.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ మాసంలో మినీ వేలం నిర్వహించనున్నారు. అయితే ఇందులో తమ జట్టులో ఉన్న కొంతమంది ప్లేయర్లను వదిలివేయాలని కేకేఆర్ భావిస్తుందట. రహానేతో పాటు మరికొంతమందిని వదిలేస్తున్నారట. అదే సమయంలో కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకురావాలని కేకేఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఢిల్లీ మాత్రం దీనికి అసలు ఒప్పుకోవడం లేదట. రింకూ సింగ్ తో పాటు రమణదీప్ సింగ్ ఇద్దరిని కూడా ఢిల్లీకి ఇవ్వాలని కోరుతోందట. అప్పుడే కేఎల్ రాహుల్ ను ఇస్తామని ఢిల్లీ తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కేకేఆర్ ను చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్ 15వ తేదీ లోపు దీనిపై క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పుడు హర్షిత్ రాణాకు కెప్టెన్సీ ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది.
🚨 KKR NEW CAPTAIN 2026 🚨
Harshit Rana to be the new captain of Kolkata Knight Riders for IPL 2026.
Source: [ TMB ]#KKR #HarshitRana#IPL2026 #Newcaptain pic.twitter.com/1T2S0uEaBJ
— lndian Sports Netwrk (@IS_Netwrk) November 3, 2025