Gold Rate Today: బంగరం ధరలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే లక్ష దాటి పోయింది.. అయిన కూడా బంగారం షాపుల్లో రద్ధీ మాత్రం తగ్గడం లేదు. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్న బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,330 ఉండగా.. నేడు గురువారం రూ.1,00,970 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.93,800 ఉండగా నేడు రూ.92,500 ఉంది. అంటే తులంపై రూ.1,360 తగ్గింది.
బంగారం ధరలు రోజురోజుకు ఇలా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు బంగారం కొనాలంటే భయపడుతున్నారు. నిన్నమోన్నటి వరకు బంగారం తగ్గుతది అని వచ్చిన సమాచారం.. ఇప్పుడు మళ్లీ లక్ష దాటిపోయింది. ఆశాడం అయిపోయింది.. నెక్స్ట్ వచ్చే శ్రావణంలో పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు వంటివి చాలా శుభకార్యాలు ఉంటాయి. ఆ సమయంలో ప్రజలు బంగారం కొనలాంటే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలకి ప్రధానంగా.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల పెరుగుదల, స్థానిక డిమాండ్ తగ్గిపోవడం లాంటి అంశాలే కారణమంటున్నారు. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అని ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ బంగారం ధరలు
నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,480 ఉండగా.. నేడు రూ.1,01,120 పలుకుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.93,950 ఉండగా.. నేడు రూ.92,700 ఉంది. ఢిల్లీలో కూడా రూ.1,360 తగ్గింది.
ముంబైలో బంగారం ధరలు
నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,330 ఉండగా.. నేడు రూ.1,00,970 పలుకుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.93,800 ఉండగా.. నేడు రూ.92,550 ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు
నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,330 ఉండగా.. నేడు రూ.1,00,970 పలుకుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.93,800 ఉండగా.. నేడు రూ.92,550 ఉంది.
Also Read: విశాఖలో మరో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బేకరీ
నేటి సిల్వర్ ధరలు
బంగారం ధరలు మాత్రమే కాదు సిల్వర్ ధరల కూడా తగ్గుముఖం పట్టింది. నిన్న కిలో వెండి ధర రూ.12,900 ఉండగా.. నేడు 12,800 కు పలుకుతోంది. అంటే కిలో మీద రూ.100 తగ్గిందని చెప్పవచ్చు