BigTV English
Advertisement

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

Jayam Ravi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా పేరు సొంతం చేసుకున్న జయం రవి (Jayam Ravi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కోలీవుడ్ లో వచ్చిన ‘జయం’ సినిమాతో సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకొని.. రవి మోహన్ కాస్త జయం రవిగా మారిపోయారు. అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటున్న జయం రవి గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేమించి, పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన జయం రవి అనూహ్యంగా ఇటీవల తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు. దీనికి తోడు ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో రహస్య రిలేషన్ కొనసాగిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


జయం రవి ఇంటిని వేలం వేస్తున్న అధికారులు..

అయితే ఇలాంటి సమయంలో తాజాగా జయం రవికి సంబంధించిన ఇల్లు , కార్లను వేలం వేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇంటికి తీసుకున్న లోన్ ఈఎంఐ చెల్లించకపోవడంతోనే ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద నోటీసులు అంటించినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నోటీసులకు స్పందించని జయం రవి..


అసలు విషయంలోకి వెళ్తే జయం రవి సుమారుగా మూడేళ్లు క్రితమే చెన్నై తూర్పు తీర రోడ్డులో ఒక బంగ్లాను కొనుగోలు చేశారుమీ అక్కడే కొంతకాలం తన భార్య ఆర్తి , పిల్లలతో నివసించారు. అయితే కుటుంబ విభేదాల వల్ల ఆ ఇంటి నుంచి జయం రవి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆర్తి తన పిల్లలతో మాత్రమే నివసిస్తోంది. ఈ పరిస్థితుల్లో గత పది నెలలుగా ఈ ఇంటి కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ మొత్తాన్ని రవి మోహన్ చెల్లించలేదని సమాచారం. ముఖ్యంగా రూ.7.64 కోట్ల లోన్ మొత్తాన్ని చెల్లించాలని ఇప్పటికే చాలాసార్లు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారట. పైగా తేనాంపేట లోని సేమేయర్స్ రోడ్డు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న జయం రవి స్టూడియోలో కూడా నోటీసులు అతికించారు. రుణం సకాలంలో తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొన్నారు.

జయం రవి పై విమర్శలు..

అయితే ఇవేవీ జయం రవి పట్టించుకోలేదు. దీనికి తోడు స్టూడియో కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగులు అతికించిన నోటీసులను కూడా అక్కడి సిబ్బంది చించేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఏకంగా వేలం వేస్తున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై జయం రవి ఎందుకు స్పందించడం లేదు అనే విషయం వైరల్ గా మారగా.. మరొకవైపు తీసుకున్న లోన్ చెల్లించకపోతే ఎలా? ఇప్పుడు దీనిపై ఉన్న లోన్ ఎవరు తీరుస్తారు? ఆర్తి తన పిల్లలతో ఎక్కడ ఉంటుంది? ముఖ్యంగా జయం రవి చేసిన తప్పిదం భార్యా పిల్లలను రోడ్డుకీడ్చేలా ఉందే అంటూ పలువురు జయం రవి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా స్టార్ సెలబ్రిటీ అయి ఉండి కూడా ఇంటికి లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడా? అంటూ కొంతమంది మండిపడుతున్నారు .

ఆడపిల్లకు సొంత ఇల్లు ఎక్కడ లేదా?

మరి కొంతమంది “ఆడపిల్లకు సొంత ఇల్లు ఎక్కడా లేదు తెలుసా?” అంటూ ఒక యంగ్ రచయిత చెప్పిన మాటలను కోట్ చేస్తున్నారు. నిజంగా ఒక ఆడపిల్లకు ఇలాంటి సందర్భం ఎదురైతే ఆమె చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు..ఏది ఏమైనా తాళి కట్టిన భార్యను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా జయం రవి రోడ్డుకీడుస్తున్నారు అనే వార్తలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై జయం రవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ALSO READ:OG Movie: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓజీ 2 కూడా?

Related News

Andhra King Taluka: జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఆంధ్రా కింగ్ ఎంతవరకు వచ్చిదంటే?

Dheeraj Mogilineni: డబ్బులు పిండుకోవడం కోసమే సీక్వెల్ సినిమాలు.. అసలు విషయం చెప్పిన నిర్మాత!

Samantha: మరి అంత చనువేంటీ సమంత ..కాస్త గ్యాప్ ఇవ్వచ్చుగా.. ఆ హగ్గులేంటీ!

Comedian Satya: హీరోగా మారిన కమెడియన్ సత్య , రితేష్ రానా మాస్ ప్లాన్

Ajith Kumar: విజయ్‌తో వైరం.. ఎట్టకేలకు నోరువిప్పిన అజిత్‌

Akhanda Thaandavam Promo: అఖండ తాండవం ప్రోమో వచ్చింది… ఇక శివతాండవమే!

Harish Shankar: వార్తలన్నీ అబద్ధాలేనా, త్రివిక్రమ్ తో హరీష్ ఇంత క్లోజ్ గా ఉంటాడా?

Mirnalini Ravi: లగ్జరీ కారు కొన్న వరుణ్‌ తేజ్ హీరోయిన్‌.. ఆ కారు కొన్న తొలి భారతీయ నటిగా ఘనత!

Big Stories

×