సాధారణంగా ఇంట్లో వంటలు చేయడానికి చాలా మంది ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. రైస్ కోసం రైస్ కుక్కర్. కూరలు, ఇతర వంటకాలు చేయడానికి నాన్ స్టిక పాన్ లు, మైక్రో ఓవెన్ లు, ఎయిర్ ఫ్రైయర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, చాలా మంది ఎయిర్ ప్రైయర్ లో వండిన వంటలు ఆరోగ్యానికి చాలా మంచివి భావిస్తుంటారు. అందులో వాస్తవం ఎంత? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? డాక్టర్లు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
ఎయిర్ ఫ్రైయర్ అనేది లేటెస్ట్ వంట పరికరం. ఇది తక్కువ నూనెతో ఆహారాన్ని వండడానికి ఉపయోగపడుతుంది. దీనితో కలిగే లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? అనేది పరిశీలిద్దాం..
⦿ తక్కువ నూనె వాడకం: ఎయిర్ ఫ్రైయర్లు వేడి గాలిని ఉపయోగించి ఆహారాన్ని వండుతాయి. సాంప్రదాయ డీప్ ఫ్రైయింగ్ తో పోలిస్తే 70-80% తక్కువ నూనె అవసరం అవుతుంది. ఇది కేలరీలను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచిది.
⦿ ఆరోగ్యకరమైన వంట: తక్కువ నూనె వాడటం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం లాంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఆహారంలో అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గుతాయి.
⦿ వివిధ రకాల వంటలు: ఫ్రైయింగ్ తో పాటు, బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్ లాంటి వంట పద్ధతులకు ఇది ఉపయోగపడుతుంది.
⦿ సమయం ఆదా: ఎయిర్ ఫ్రైయర్ త్వరగా వేడెక్కుతుంది. సాంప్రదాయ ఓవెన్ ల కంటే వేగంగా వంట చేస్తుంది.
⦿ సులభంగా శుభ్రం చేయడం: చాలా ఎయిర్ ఫ్రైయర్లు నాన్ స్టిక్ కోటింగ్ ను కలిగి ఉంటాయి. ఇవి సులభంగా శుభ్రం చేయడానికి వీలు కల్పిస్తాయి.
⦿ సురక్షితమైన వంట: డీప్ ఫ్రైయింగ్ లో వేడి నూనె వల్ల ఉండే ప్రమాదాలు.. అంటే చర్మం కాలడం, అగ్ని ప్రమాదం లాంటివి ఎయిర్ ఫ్రైయర్ లో ఉండవు.
⦿ పరిమిత సామర్థ్యం: ఎయిర్ ఫ్రైయర్ లు సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటాయి. పెద్ద మొత్తంలో ఆహారం వండడానికి అనుకూలంగా ఉండదు.
⦿ రుచిలో తేడా: డీప్ ఫ్రైడ్ ఆహారంతో పోలిస్తే, ఎయిర్ ఫ్రైయర్ లో వండిన ఆహారం రుచితో పాటు చూడ్డానికి కొంత భిన్నంగా ఉండవచ్చు.
⦿ అక్రిలమైడ్ ఏర్పడే ప్రమాదం: అధిక ఉష్ణోగ్రతల దగ్గర బంగాళదుంపలు, బ్రెడ్ వంటివి వండినప్పుడు అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడవచ్చు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
⦿నైపుణ్యం అవసరం: ఎయిర్ ఫ్రైయర్‌ను పర్ఫెక్ట్ గా ఉపయోగించడానికి కొంత సమయం పడుతుంది. ఉష్ణోగ్రత, సమయం సరిగ్గా సెట్ చేయకపోతే ఆహారం సరిగ్గా ఉడకదు.
⦿ కరెంట్ వినియోగం: ఎయిర్ ఫ్రైయర్‌లు కరెంట్ ను ఉపయోగించుకుంటాయి. గ్యాస్ స్టవ్‌లతో పోలిస్తే కరెంట్ బిల్ పెరగవచ్చు.
⦿ ధర ఎంత ఉంటుందంటే?: మంచి క్వాలిటీని బట్టి ఎయిర్ ఫ్రైయర్ లు రూ. 4 వేల నుంచి ఉన్నాయి. సాధారణంగా ఖరీదైనవి. చిన్న కుటుంబాలకు ఇది ఖర్చుతో కూడుకున్నది కావచ్చు.
Read Also: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!