BigTV English

OG Movie: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓజీ 2 కూడా?

OG Movie: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓజీ 2 కూడా?

OG Movie:ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా దానికి సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలకు మంచి హైప్ ఉంటే ఖచ్చితంగా వాటికి సీక్వెల్స్ చివర్లో హింట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓజీ మూవీకి కూడా పార్ట్-2 ఉంటుంది అన్నట్లుగా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ సుజీత్. మరి ఓజీ మూవీ కి సీక్వెల్ ఉంటుందా..? ఒకవేళ ఉంటే ఆ క్లైమాక్స్ లో స్టోరీ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


OG తో క్యాజీ అనిపించిన సుజీత్..

సాహో మూవీ తీసి బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ సుజీత్ ఓజీ మూవీతో మన ముందుకు వచ్చేసారు. సాహో మూవీ రిజల్ట్ కాస్త పక్కన పెడితే.. ఇటు ఓజీ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. అదే హైప్ తో సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులు పర్వాలేదు అంటున్నా.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం బ్లాక్ బాస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు మొదటి రోజు ఏకంగా రూ.100 కోట్లు గ్యారెంటీ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కానీ సినీ ప్రేక్షకులు మాత్రం ఓజీతో క్యాజీ అనిపించేసాడు డైరెక్టర్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..


త్వరలో ఓజీ 2 కూడా..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి పార్ట్ -2 కూడా ఉండబోతున్నట్టు డైరెక్టర్ హింట్ ఇచ్చేశారు. అయితే ఓజీ పార్ట్-2 లో కథ, స్టోరీ ఏముంటుంది అనేది చూసుకుంటే.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో జపాన్ లోని యూజికులను అంతం చేసి వారికి శత్రువుగా మారారు. అలాగే ముంబై వచ్చి ఓమి ని అంతం చేసి డేవిడ్ భాయ్ కి శత్రువుగా మారారు.అయితే ఈ ఇద్దరు శత్రువులు కలిసి ఓజి పార్ట్-2 లో పవన్ కళ్యాణ్ ని చంపాలనే కసితో ఉంటారని తెలుస్తోంది. ఇదే కాన్సెప్ట్ తో డైరెక్టర్ సుజిత్ పార్ట్ -2 తీయబోతున్నట్టు సమాచారం. అలాగే ప్రకాష్ రాజ్ దగ్గర నుండి వెళ్లిపోయి కన్మణిని పెళ్లి చేసుకున్న తర్వాత జపాన్ కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ చనిపోయినట్టు పుకార్లు పుట్టించినట్టు డైరెక్టర్ ఇందులో హింట్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ చనిపోయినట్లు వార్తలు వచ్చిన సమయంలో ఏం జరుగుతుంది అనేది కూడా సుజీత్ పార్ట్-2లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ALSO READ:Nagarjuna: న్యాయం చేయండి.. ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగార్జున

పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తారా?

మొత్తానికి ఓజీ క్లైమాక్స్ లో ఓజీ పార్ట్ 2 ఉండబోతున్నట్టు టైటిల్ కార్డు వేసి సినిమాని ఎండ్ చేసేశారు. ఓజీ పార్ట్ 2 పూర్తిగా జపాన్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఓజీ పార్ట్ 2 విషయం బాగానే ఉంది కానీ పార్ట్-2 కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న.. ఎందుకంటే పవన్ తాను ఒప్పుకున్న మూడు సినిమాలు మాత్రమే చేస్తానని ఒప్పుకున్నారు. ఈ సమయంలోనే హరిహర వీరమల్లు మూవీ విడుదలయ్యాక దానికి పార్ట్ 2 ఉన్నట్లు చూపించారు. అలాగే ఇప్పుడు ఓజీ కి కూడా పార్ట్ 2 ఉన్నట్లు చూపించడంతో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో రెండు సినిమాలు యాడ్ అయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను చేస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Related News

OG Movie: ఓజీ షోలో విషాదం…ప్రమాదంలో ఇద్దరు పవన్ ఫ్యాన్స్

OG Movie: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పవన్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడా ..?

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

OG Collections: ఓజీ డిస్ట్రక్షన్… ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 160 కోట్లు

Chiranjeevi: ఓజీ రివ్యూ చెప్పేసిన చిరు.. కళ్యాణ్ బాబును అలా చూడడం..

Nagarjuna: న్యాయం చేయండి.. ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగార్జున

OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

Big Stories

×