OG Movie : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చేసింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. విడుదలకు ముందు ఉన్న అంచనాలు విడుదల అయిన తర్వాత లేవనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది.. ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ పైనే ఆశలు పెట్టుకున్నారు.. సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కేవలం ఒక నెల మాత్రమే ఉండడంతో ఈ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. వినాయక చవితి సందర్భంగా ప్రతి మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతుందని మేకర్ క్లారిటీ ఇచ్చారు.
‘ఓజీ ‘ అప్డేట్ రెడీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ.. డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా వీరి నడుమ సాగే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని రెండో పాటగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సాంగ్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీంతో ఈ ఆగష్టు 27న మేకర్స్ వినాయక చవితి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అంటే మొత్తానికి ఈ మూవీ నుంచి సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Also Read : రియల్ స్టోరీతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్..
ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ల, ఫస్ట్ లుక్, ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా కళ్లు చెదిరే బిజినెస్ చేస్తోంది.. ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తెరపై పవన్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు…