BigTV English

SSMB 29: రాజమౌళి సినిమాలన్నింటికీ మించిన సీన్!

SSMB 29: రాజమౌళి సినిమాలన్నింటికీ మించిన సీన్!

SSMB 29: ‘శాంతి నివాసం’ అనే సీరియల్ తో ఎపిసోడ్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి (Rajamouli).. ఆ తర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, సై, ఈగ, మగధీర, విక్రమార్కుడు, ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ అంటూ వరుస పెట్టి చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అంతేకాదు తన చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి వారి ప్రశంసలు కూడా అందుకున్నారు రాజమౌళి.


ఎస్ఎస్ఎంబి 29 నుండీ అదిరిపోయే న్యూస్..

అలాంటి ఈయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలకపాత్ర పోషిస్తున్నారు. నవంబర్లో ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ వదులుతానని.. రాజమౌళి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ట్విట్టర్ వేదికగా ట్వీట్ తో ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇకపోతే ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. మరొకవైపు ఈ సినిమా నుంచి వినిపిస్తున్న వార్తలు అభిమానులలో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి వినిపిస్తున్న ఒక వార్త సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.


సింహాలతో పోటీ..

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మొన్నమధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. దట్టమైన అడవుల్లో క్రూరమైన జంతువుల మధ్య ఒక చేజింగ్ సీన్ ఉంటుందట. ఈ సీన్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ను మించి ఇందులో ఇంటర్వెల్ సీన్ ను ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. భారీ సింహాలతో సీన్ ను డిజైన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. దీనికోసం కొన్ని నెలలు అక్కడే ఉండి షూటింగ్ కంప్లీట్ చేస్తారట. ఇక రాజమౌళి సినిమాలలో ఇప్పటివరకు చూడని ఒక అద్భుతమైన ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాలో ఉండబోతుందని సమాచారం.

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వార్త..

సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే ప్రతి చిన్న బిట్ ఎంతో స్పెషల్ గా ఉంటుంది. ఏది కూడా అంత ఈజీగా ఒప్పుకోడు.. అది ఆయనకు నచ్చిన విధంగా వచ్చేవరకు వదిలిపెట్టడు. ప్రతి సీన్.. ప్రతి ఫ్రేమ్ తాను అనుకున్నట్టు రావాల్సిందే.. దానికోసం నటీనటులను ఇబ్బంది పెట్టైనా రీ షూట్ చేయిస్తారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు సింహాలతో సీన్లు పైగా భారీ ఇంటర్వెల్ సీన్లు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఆఫ్రికాలో ఫేమస్ సింహాన్ని చూసి వచ్చారని.. అందులో భాగంగానే ఆ సింహాన్ని ఇప్పుడు ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. మొత్తానికైతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ మరి ఇలాంటి సీన్ సినిమాలో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ALSO READ:Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Related News

TVK Maanadu : విజయ్ పొలిటికల్ బోణి అదిరిపోయింది… ఏకంగా 86 లక్షల మంది

Coolie Collections : కూలీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.. అక్కడ ఛావా రికార్డు బ్రేక్..

Cine Workers Strike: ఈ వేతనాలు మాకోద్దు.. సినీ కార్మికులు అసంతృప్తి.. సోమవారం ఏం జరగబోతుంది?

Pawan Kalyan: ఓకే నెలలో 3 పవన్ కళ్యాణ్ సినిమాలు, ఓజీ ముందు అవసరమా? 

Little Hearts: అనుష్క ‘ఘాటీ’కి పోటీగా చిన్న సినిమా.. వారం ముందుగానే థియేటర్లలోకి, కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే!

OG Movie : ‘ఓజీ’ నుంచి వినాయక చవితి సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా..!

Big Stories

×