Darshana Rajendran: ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చాక సినిమాలకు డిమాండ్ పెరిగింది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ అవ్వని చిత్రాలు సైతం.. అక్కడ మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. థియేటర్లలోకి రిలీజ్ అయిన నాలుగైదు వారాల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ లకు రీచ్ ఎక్కువ. ఇతర జానర్లతో పోలిస్తే ఓటీటీ ఆడియెన్స్ వీటిని ఎక్కువగా చూస్తున్నారు.. తెలుగు సినిమాలు కన్నా మలయాళ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రతివారం ఓటీటీలోకి బోలెడు థ్రిల్లింగ్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థ్రిల్లింగ్, క్రైమ్ స్టోరీతో ఓ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. మరి ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్…
మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇక్కడికొచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. దాని పేరు ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’. ఇది ఒక మలయాళ క్రైమ్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. తాజా గా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఆసక్తికర సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెడుతుంది.
ఆ ఓటీటీలోకే వచ్చేస్తుంది..
మలయాళ ఇండస్ట్రీలో దర్శన రాజేంద్రన్ మలయాళంలో పాపులర్ హీరోయిన్లలో ఒకరు.. ఈమె చేస్తున్న ఏదైనా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీ ప్రకటించింది. కాగా ఈ వెబ్ సిరీస్‌కు క్రిషాంద్ దర్శకత్వం వహించారు.. ఇది ఏకంగా తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ ఓటీటీ రిలీజ్ కానుంది..
Also Read : అరేయ్.. మా వంటలక్కను ఏం చేస్తున్నారు..? మరీ దారుణం…
స్టోరీ విషయానికొస్తే..
ఇదొక భయంకరమైన క్రైమ్ స్టోరీ.. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇది రాబోతుందని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌లో దీన్ని తెరకెక్కించారు. ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ అనే టైటిల్ ను చూస్తేనే కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. వాళ్ల ఊరిలో ఆలయ ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. మరోవైపు పూలతో ఫ్లవర్ కింగ్ అని పిలిపించుకునే ఓ వ్యక్తి నే క్రైమ్ చేస్తున్నాడని అందరు అనుకుంటారు. పూలు, పాలు వ్యాపారాలు చేసే వాళ్లను టార్గెట్ చేస్తారు.. అసలు స్టోరీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. క్రైమ్ పాల్పడేది ఎవరు అన్నది ఈ స్టోరీ… ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్లు వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేస్తున్నాయి.