BigTV English

Traffic Diversions: వినాయక చవితి పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, నిమజ్జనానికి ఏర్పాట్లు

Traffic Diversions:  వినాయక చవితి పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, నిమజ్జనానికి ఏర్పాట్లు

Traffic Diversions: వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలు భాగ్యనగరం హైదరాబాద్‌లో సందడి అంతాఇంతా కాదు.  భక్తుల చూపంతా హైదరాబాద్ సిటీపై ఉంటుంది.  ముఖ్యంగా ఖైరతాబాద్ గణేషుడి గురించి చెప్పనక్కర్లేదు. బుధవారం నుంచి వినాయక చవితి నేపథ్యలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.


హైదరాబాద్ సిటీలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు మొదలుకానున్నాయి. వినాయక చవితి నేపథ్యంలో ఈనెల 27నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ గణేష్ పరిసర ప్రాతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు.

ఖైరతాబాద్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు నిరంకారి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ సైఫాబాద్ పీఎస్‌ నుంచి రాజ్‌‌దూత్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు డైవర్ట్ చేస్తున్నారు.  ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వచ్చే వాహనాలు సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు వెళ్లనున్నాయి.


నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా దారి మళ్లించారు. ఇక ఖైరతాబాద్ పోస్టాఫీస్ నుంచి నిరంకారి నుంచి భవన్ వైపు వచ్చే వాహనాలు ఓల్డ్ సైఫాబాద్ పిఎస్‌ జంక్షన్ వైపు మళ్లించారు.

ALSO READ: యూరియా కబురొచ్చింది.. ఇరుకునపడ్డ బీఆర్ఎస్

అలాగే ఖైరతాబాద్ గణేషుడు దర్శనానికి వచ్చే భక్తులకు ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు పోలీసులు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగించాలని భక్తులను కోరారు పోలీసులు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల గుండా వెళ్ళాలని సూచన చేశారు.

పార్కింగ్ కోసం నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. వాటిలో రేస్‌కోర్స్ రోడ్, ఎన్‌టిఆర్ ఘాట్, ఐమాక్స్ లాట్స్, విశ్వేశ్వరయ్య భవన్ ఉన్నాయి. మరోవైపు గణేషుడు నిమజ్జన కోసం ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. వాటిలో 28 పోర్టబుల్ చెరువులు, 21 ప్రత్యేక చెరువులు, 29 చిన్నపాటి చెరువులు ఉన్నాయి. ఏయే ప్రాంతాలవారు ఎక్కడ నిమజ్జనం చేయాలనేది క్లియర్‌గా వివరించారు.

 

 

Related News

Juniors vs Seniors: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పడగవిప్పుతున్న ర్యాగింగ్

BRS Politics: యూరియా కబురొచ్చింది.. ఇరుకునపడ్డ బీఆర్ఎస్, ఆ నిర్ణయం మాటేంటి?

KTR Vs Kavitha: గులాబీ శ్రేణుల్లో గుబులు.. ముదిరిన అన్న, చెల్లెలి వివాదం

AP-Telangana: యూరియా కొరతకు బ్రేక్.. ఫలించిన ఒత్తిడి, తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆనందం

Weather News: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, జాగ్రత్తగా ఉండడి..!

Big Stories

×