E-Paper
Advertisement

జురాసిక్ పార్క్ నటుడు మృతి..మరణానికి కారణం?

జురాసిక్ పార్క్ నటుడు మృతి..మరణానికి కారణం?
Advertisement

Film industry: చిత్ర సీమలో వరుస విషాదాలు ఇండస్ట్రీని దుఃఖంలోకి నెట్టి వేస్తున్నాయి. దక్షిణ భారతదేశపు డెక్కన్ నైటింగేల్ గా, గాన కోకిలగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి గుండెపోటుతో మరణించిన వార్త మరువక ముందే ఇప్పుడు మరొక నటుడి మరణం అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఊహించని పాత్రలతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఆయన.. అనారోగ్య సమస్యలతో మరణించారనే వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఎవరు ఆ నటుడు? ఆయన మరణానికి గల కారణం ఏమిటి?అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కన్నుమూసిన జురాసిక్ పార్క్ నటుడు..

ఆయన ఎవరో కాదు హాలీవుడ్ క్లాసిక్ మూవీ జురాసిక్ పార్క్ లో డాక్టర్ అలాన్ గ్రాంట్ పాత్రతో ప్రపంచ స్థాయి గుర్తింపుని తెచ్చుకున్న సీనియర్ నటుడు సర్ సామ్ నీల్. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు..” సామ్ నీల్ ప్రశాంతంగా ఇంట్లోనే కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు” అని చెప్పారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మూడేళ్ల క్రితమే బ్లడ్ క్యాన్సర్ నుండి కోలుకున్న సామ్..

Advertisement

ఇకపోతే సామ్ నీల్ గత కొద్ది రోజుల క్రితమే సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 78 సంవత్సరాల వయసున్న సామ్.. వయసు మీద పడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతోనే చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 2023లో తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పిన సామ్.. ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డారు.ఆ తర్వాత కూడా సినిమాల పరంగా యాక్టివ్గానే ఉన్నారు.

సామ్ నీల్ కెరియర్..

ఈయన కెరియర్ విషయానికి వస్తే.. నార్త్ ఐర్లాండ్ లో జన్మించినా.. న్యూజిలాండ్ ను తన నివాసంగా మార్చుకొని నటుడిగా అవతారమెత్తారు. తన సుదీర్ఘ నటన ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈయన కెరియర్ను యూటర్న్ తిప్పింది మాత్రం జురాసిక్ పార్క్ అనే చెప్పాలి. హాలీవుడ్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అలిన్ గ్రాంట్ గా ప్రపంచవ్యాప్తంగా చెరగని ముద్ర వేసుకున్నారు. అంతే కాదు జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

Advertisement

ALSO READ:నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!

అడ్వెంచర్ మూవీస్ నుండి రొమాంటిక్ హీరో వరకు..

ఇకపోతే లీడ్ రోల్స్ , అడ్వెంచర్ మూవీలకు మాత్రమే పరిమితం కాకుండా రొమాంటిక్ హీరో పాత్రలు మొదలుకొని భయంకరమైన విలన్ పాత్రలు కూడా పోషించారు. ది పియానో, ది జంగిల్ బుక్, ఇన్ ద మౌత్ ఆఫ్ మ్యాడ్ నెస్ , హంట్ ఫర్ ది అండ్ వైల్డర్ పీపుల్ ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక అలాంటి ఒక గొప్ప నటుడు నేడు మన మధ్య లేడు అని తెలియడంతో పలువురు ప్రముఖులు అభిమానులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Related News

జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!

టాలీవుడ్‌లో డ్యాన్స్ వార్: శేఖర్ మాస్టర్ vs జానీ మాస్టర్…అసలేం జరుగుతుంది?

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

ఎక్కడ చూసినా ‘బాసింగ బలాలు’ మ్యాజిక్కే..నాలుగు వారాల్లోనే ఊహించని రికార్డు!

లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?

Big Stories

Advertisement
×