E-Paper
Advertisement

టాలీవుడ్‌లో డ్యాన్స్ వార్: శేఖర్ మాస్టర్ vs జానీ మాస్టర్…అసలేం జరుగుతుంది?

టాలీవుడ్‌లో డ్యాన్స్ వార్: శేఖర్ మాస్టర్ vs జానీ మాస్టర్…అసలేం జరుగుతుంది?
Advertisement

Shekar Master vs Jani Master:శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్…ఈ ఇద్దరు ఇండస్ట్రీని తమదైన స్టెప్పులతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నవారే. టాప్ హీరోలందరి బెస్ట్ డాన్స్ మూమెంట్స్ ఎక్కువగా వీరి కొరియోగ్రఫీలో వచ్చినవే. ఇలా టాప్ కొరియోగ్రాఫర్లు గా దూసుకుపోతున్న ఈ ఇద్దరి మధ్య జరిగిన పంచాయితీ ఇపుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.

ఎలాగైనా ఆ ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచనతోనే

Advertisement

అయితే వినిపిస్తున్నట్టుగా దీనికి ప్రధాన కారణం జానీ మాస్టర్ భార్య సుమలతే అని తెలుస్తుంది. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కి ఈవిడే ప్రస్తుతం అధ్యక్షురాలు.ఈవిడ ఎవరి పర్మిషన్ తీసుకోకుండా,కనీసం మెంబర్స్ అనుమతి లేకుండానే ఏకపక్షంగా అసోసియేషన్ లో జరగాల్సిన ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ.అయితే ఈ నిర్ణయానికి జానీ మాస్టర్ వర్గం సపోర్ట్ చేస్తుండగా ఎవరి అనుమతి లేకుండా ఎలా ఎలా ఎన్నికలు పెడతారంటూ శేఖర్ వర్గం వ్యతిరేకిస్తుంది.ముఖ్యంగా కొత్తగా ఇచ్చిన మెంబర్ షిప్ లలో ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేదని , ఎలాగైనా ఆ ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచనతోనే ఇలా డ్రామాలకి తెరతీశారన్నది శేఖర్ వర్గం ఆరోపణ.ఇక ఇదే క్రమంలో సుమలత తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ ఏకంగా పది మంది సీనియర్ డాన్సర్స్ తమ పదవులకి రాజీనామా చేయడంతో ఈ వివాదం కాస్తా మరింత ముదిరిపోయింది.

రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి

Advertisement

ఇక తాజాగా డ్యాన్స్ యూనియన్ ఆఫీసులో జరిగిన మీటింగ్ కాస్తా రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఒక యుద్ద వాతావరణం క్రియేట్ అయింది.డాన్స్ యూనియన్ లో డబ్బులు దారి మళ్ళాయని, అలాగే కమిటీల్లో తీసుకుంటున్నవి వన్ ఎయిడ్ డిసీషన్స్ అంటూ ఒకరి వర్గం మరొకరి పై కొట్టుకునేదాకా వెళ్ళింది. ఇదంతా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ల ముందే జరగడం, వాళ్ళు కూడా అంతే అగ్రెసివ్ గా ముందుకు పోవడంతో ఎంట్రీ ఇచ్చారు పోలీసులు.డాన్స్ మాస్టర్స్ తమ స్టెప్పులతో హీరోల ద్వారా ఆడియన్స్ ని అలరించాలి కాని ఇలా యూనియన్ పరువు తీసేలా పబ్లిక్ లోనే ఇలా పంచాయితీలు పెట్టుకోవడం ఏంటి అన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.ఇక ఈ రచ్చ ఇలాగే కంటిన్యూ అయితే అది మెంబర్స్ యొక్క జీవన ఉపాధి పై పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ వివాదానికి ఎప్పుడు ఎలా ముగింపు పలుకుతారో !

అయితే జానీ మాస్టర్ గతంలో ఒక కేసు కారణంగా ఇండస్ట్రీకి దూరమైన సందర్భంగా శేఖర్ మాస్టర్ హవా చూపించాడని, కాని ఇపుడు మళ్ళీ జానీ మాస్టర్ మునుపటిలా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కారణంగానే శేఖర్ మాస్టర్ ఇల్లా గొడవకి దారితీస్తున్నాడంటూ జానీ మాస్టర్ వర్గం ఆరోపిస్తుంది.చూడాలి మరి స్టెప్పులతో అలరించాల్సిన ఈ స్టార్ కొరియోగ్రాఫర్స్ ఈ వివాదానికి ఎప్పుడు ఎలా ముగింపు పలుకుతారో !

also read :విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×