Parvati Melton: నటి పార్వతి మెల్టన్ అభిమానులకు షాకిచ్చింది. బేబీ బంప్ తో కనిపించి సర్ప్రైజ్ చేసింది. వెన్నెల సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పార్వతి జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు..తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోయినా.. దూకుడులో ఐటెంగర్ల్ గా నటించి మెప్పించింది. అయితే ఈ సాంగ్ అయినా ఆమెకు కలిసివస్తుంది అంటే అది లేదు. దీంతో పార్వతి ఇండస్ట్రీకి దూరమైంది.
ఇక 2012 లో పార్వతి.. బిజినెస్ మ్యాన్ అయిన సంసు లాలనిని వివాహమాడింది. పెళ్లి తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా కూడా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు. ఇక పూర్తిగా సినిమాలకు దూరమైన పార్వతి ఈమధ్యనే సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
డార్క్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. బికినీ ట్రీట్ దగ్గరనుంచి శరీరరానికి కలర్ పూసుకొని.. అందాలను మాత్రమే చూపించే ఫోటోషూట్స్ లలో కనిపిస్తుంది. ఇక తాజాగా పార్వతి ఫోటోషూట్ పలు అనుమానాలకు దారితీసింది. సడెన్ గా ఈ చిన్నది బేబీ బంప్ తో ప్రత్యేక్షమయ్యింది. వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో బేబీ బంప్ తో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది. “కొండలు, పువ్వులు, గాలి… అన్నీ నేను మోసే నా చిన్న హృదయ స్పందనతో సమయాన్ని నిలుపుకుంటాయి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇకపోతే గత కొన్నేళ్లుగా పార్వతి మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫోటోషూట్స్ అని, తాను ఎలాంటి పాత్రలకైనా సిద్దమే అని చెప్పడానికే ఇంత అందాల ఆరబోత అని తెలుస్తోంది. మరి పార్వతి బిడ్డకు జన్మనిచ్చాక ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తుందా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.