Malavika Mohanan: ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas ) హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. దీంతో ఎక్కడ చూసినా ఈమె పేరు బాగా మారుమ్రోగుతోంది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె అభిమానికి మాట ఇచ్చినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అభిమానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను ఆమె నిలబెట్టుకుంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అభిమానికి మాట ఇచ్చిన మాళవిక..
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు పాపులారిటీ సొంతం చేసుకోవడానికి అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మాళవిక కూడా తాజాగా సోషల్ మీడియా వేదికగా ‘ఆస్క్ మాళవిక’ అంటూ అభిమానులతో ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇందులో భాగంగా ఒక అభిమాని మాట్లాడుతూ..” డార్లింగ్ ప్రభాస్ తో సెల్ఫీ ఫోటో షేర్ చేయండి”.. అంటూ అడిగారు. దీనిపై మాళవిక మాట్లాడుతూ..” పాటల షెడ్యూల్ సమయంలో నేను ఒక ఫోటో తీసుకొని మీతో పంచుకుంటాను. ఇది నా ప్రామిస్”. అంటూ తెలిపింది మాళవిక. మొత్తానికైతే ప్రభాస్ తో సెల్ఫీ దిగి షేర్ చేస్తాను అంటూ మాట ఇచ్చింది మాళవిక. మరి ఇచ్చిన మాటను ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.
ది రాజాసాబ్ సినిమా విశేషాలు..
ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. తెలుగు రొమాంటిక్ హార్రర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక కూచిబొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhhi Agerwal) రిద్ధీ కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ డిసెంబర్ 5కి వాయిదా వేశారు. కనీసం ఇప్పుడైనా సినిమా వస్తుందా అంటే అది కూడా లేదనే చెప్పాలి. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలువనుంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మాళవిక మోహనన్ కెరియర్..
మాళవిక మోహనన్ కెరియర్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. సినీ నటిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. 2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ ద్వారా అడుగుపెట్టి తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. 2020లో చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ క్యాటగిరిలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.
also read: Bigg boss Agni Pariksha: బ్రెయిన్ టాస్క్ కి ఆడియన్స్ ఫిదా.. మరీ ఇంత తుత్తర అయితే ఎలా?