BigTV English

Pune News: లవ్ ట్రాజెడీ.. పెళ్లి మాటలు అన్నారు, కొట్టి చంపేశారు

Pune News: లవ్ ట్రాజెడీ.. పెళ్లి మాటలు అన్నారు, కొట్టి చంపేశారు

Pune News: ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన సంబంధాల కంటే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అఫ్‌ కోర్సు .. కారణాలు ఏవైనా కావచ్చు. కూతురు ప్రేమను కాదనలేక కొందరు తల్లిదండ్రులు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. మరికొందరు ససేమిరా అంటున్నారు. కాకపోతే పూణెలో జరిగిన ఘటన మాత్రం ఇందుకు భిన్నం. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లో వెళ్తే..


పూణెలోని పింప్రి చించ్వాడ్‌లో సాంఘ్వి ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే యువకుడు రమేశ్ ఘెంగాత్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా మారింది. చివరకు ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. ఇంతవరకు బాగానే జరిగింది. కూతురు ప్రేమ వ్యవహారం పేరెంట్స్‌కి తెలిసింది.

తొలుత కూతుర్ని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజెప్పినా కూతురు వినలేదు.  రమేష్ పై కేసులు ఉన్నాయని చెప్పారు. చివరకు పోస్కో కేసులో నిందితుడని వివరించే ప్రయత్నం చేశారు.  ససేమిరా ప్రేమించినవాడ్ని పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. దీంతో చేసేదేమీ లేక సరేనని ఊ కొట్టారు అమ్మాయి తరపు బంధువులు.


దీంతో యువతి కళ్లలో ఆనందం అంతా ఇంతా కాదు. తన కల నెరువేరుతుందని భావించింది. డ్రీమ్స్‌లో తేలిపోయింది. చివరకు పెళ్లి కోసం మాట్లాడుకుందామని కూతురుతో చెప్పారు. వెంటనే ప్రియుడు రమేష్, వారి తల్లిదండ్రులకు కబురు పెట్టింది ఆ అమ్మాయి.

ALSO READ: 7 నెలల గర్భవతిని గొంతు కోసి చంపిన సవతి కొడుకు

రమేష్ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ప్రియురాలి ఇంటికి వచ్చాడు. మాటల సమయంలో ఇరు కుటుంబాల చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో అమ్మాయిని వలలో వేసుకున్నాడని ఆరోపించారు. ఇరు కుటుంబాల మధ్య మాటలు పెరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన యువతి కుటుంబసభ్యులు రమేశ్‌ను చితక బాదారు.

తీవ్ర గాయాల పాలైన రమేశ్ స్పృహ తప్పాడు. వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ రమేశ్ చనిపోయాడు. కళ్ల ముందు కొడుకు చనిపోవడంతో ఆగ్రహానికి గురైన రమేశ్ తల్లిదండ్రులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు, యువతి కుటుంబానికి చెందిన 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో జరగడం ఇదే తొలిసారని అంటున్నారు. ప్రేమ ఏమోగానీ చివరకు ట్రాజెడీగా ముగిసిందని అంటున్నారు.

Related News

Double Murder: డబుల్ మర్డర్‌.. భార్య, అత్తను కత్తెరతో హత్య చేసిన అల్లుడు!

Ganesh Festival Tragedy: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. పశ్చిమగోదావరి, అల్లూరిలో ఆరుగురు మృతి!

Karimnagar: దారుణం.. 7 నెలల గర్భిణిని గొంతు కోసి చంపిన సవతి కొడుకు.

Telangana: దారుణం.. కుక్కకాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి

Gujarat News: సోషల్‌ మీడియా చిచ్చు.. వీధిలో దారుణహత్య, అమ్మాయి గొంతు కోసిన యువకుడు

Big Stories

×