BigTV English

The Door OTT: సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన భావన మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

The Door OTT: సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన భావన మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
Advertisement

Bhavana The Door OTT: నటి భావన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ పరిశ్రమకు చెందిన తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచితమే. ఒంటరి, మహాత్మ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. వ్యక్తిగత విషయాల కారణంగా వెండితెరకు దూరమైన భావన కొన్నేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె ఓ హారర్‌ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.


5 నెలల తర్వాత ఓటీటీకి

క్షణం క్షణం ఉత్కంఠ పెంచే హారర్‌ ఎలిమెంట్స్‌తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా దాదాపు 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అయితే విడుదలైన మూడు నెలలకు ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. కానీ ఇండియన్‌ ఫ్యాన్స్‌కి ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఈ క్రమంలో 5 నెలల తర్వాత ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఇండియన్‌ మూవీ లవర్స్‌కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకి అదే మూవీ? ఏ ఓటీటీలోకి వచ్చిందో చూద్దాం! లాంగ్‌ గ్యాప్‌ తర్వాత నటి భావన నటించిన లేటెస్ట్‌ హారర్‌ మూవీ ‘ది డోర్‌'(The Door). తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం గత మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.


ఇందులో భావన నటకు మంచి మార్కులు పడ్డాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్కిటెక్చర్‌గా ధైర్యవంతురాలైన యువతి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా దాదాపు 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమిళ్‌లో ఈ చిత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది. కేవలం తమిళ భాషల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కి వచ్చింది. అలాగే మరో ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైం వీడియోలోనూ ‘ది డోర్‌’ అందుబాటులో ఉంది. కానీ, స్ట్రీమింగ్‌ మాత్రం అందుబాటులో లేదు. ప్రస్తుతం తమిళ భాషలోనే అందుబాటులో ఉన్న ఈ చిత్రం.. త్వరలోనే మిగతా భాషల్లోనూ స్ట్రీమింగ్‌కి రానుందని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత ది డోర్‌ ఓటీటీకి రావడంతో తమిళ్‌ మూవీ ప్రియులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మంచి హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారు ‘ది డోర్‌’ చూసి ఎంజాయ్‌ చేయండి.

కథేంటంటే

ఆర్కిటెక్చర్ గా నటించిన భావనకు తరచూ ఆత్మలు దర్శనం ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఆమె ఆత్మలతో మాట్లాడటం చేస్తుంది. ఇలా ప్రతి క్షణం భయానక సంఘటనలు, సస్పెన్స్ తో ది డోర్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. ఈ సినిమా హారర్, థ్రిల్లర్ శైలిని ఇష్టపడే వారికి ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని అందిస్తుంది. పారానార్మల్ హారర్ ఈ సినిమాకు ప్రధాన బలం. చిత్రంలో భయానక దృశ్యాలు, ఆత్మల దర్శనాలు.. ప్రధాన పాత్రల చూట్టూ అవి తిరుగుతూ గుసగుసలాడటంతో.. దానివల్ల మిత్రకు ఎదురైన అనుభవం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. తన తండ్రి గతంలోని చీకటి రహస్యాలను మిత్ర తెలుసుకోవడంతో కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. భూమి కబ్జా కేసులు, అవినీతి, హత్యలు వంటి అంశాలు కథలో సామాజిక సందేశాన్ని అందిస్తాయి. భవనా మీనన్ పోషించిన మిత్ర ఒక ధైర్యమైన, తెలివైన స్త్రీ పాత్ర, ఆమె భయాన్ని ఎదుర్కొంటూ సత్యాన్ని వెలికితీస్తుంది.

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×