BigTV English

Karimnagar: దారుణం.. 7 నెలల గర్భిణిని గొంతు కోసి చంపిన సవతి కొడుకు.

Karimnagar: దారుణం.. 7 నెలల గర్భిణిని గొంతు కోసి చంపిన సవతి కొడుకు.

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇల్లందకుంట మండలం టేకుర్తిలో ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని.. గర్భిణిగా ఉన్న సవతి తల్లిని గొంతుకోసి హత్య చేశాడు నిందితుడు. మృతురాలికి స్కానింగ్ తీయడంతో గర్భంలో ఉన్న పాప కూడా మరణించినట్లు గుర్తించారు డాక్టర్లు. మృతురాలి భర్త మొదటి భార్య ఇద్దరు కుమారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె బంధువులు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ఆస్తి కోసం గర్భంతో ఉన్న సవతి తల్లిని చంపిన నిందితుడు..
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో ముద్రబోయిన రాములు అనే వ్యక్తి ఇద్దరు భార్యలతో జీవిస్తున్నాడు. అతని మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో భార్య ముద్రబోయిన తిరుమలమ్మ చిగురు మామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందినది. ఆమెను 8 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం తిరుమలమ్మ 7 నెలల గర్భిణిగా ఉంది.

మృతురాలకి స్కానింగ్ తీయడంతో.. గర్భంలో పాప చనిపోయందని గుర్తించిన డాక్టర్..
కుటుంబంలో ఆస్తి వివాదాలు, వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో మొదటి భార్య కుమారులు శనివారం నాడు తిరుమలమ్మపై దాడి చేసి ఆమె గొంతు కోసి హత్య చేశారు.. అయితే అక్కడి స్థానికులు ఆమె అరుపులకు విని అక్కడి వెళ్లి చూడగా అప్పటికే తిరుమలమ్మ మరణించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ తీయించగా గర్భంలో ఉన్న పాప కూడా మరణించిందని వైద్యులు తెలిపారు. అనంతరం మృతురాలి శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


Also Read: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది

నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి బంధువులు..
అయితే తిరుమలమ్మ బంధువులు వివరాల ప్రకారం రాములు మొదటి భార్యతో గొడవలు పడి రెండో భార్యతో ఉంటున్నాడు. ఆస్తి విషయంలో ఉద్రిక్తతలు పెరిగి, మొదటి భార్య కొడుకు తిరుమలమ్మను దాడి చేసి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి భార్య ఇద్దరు కుమారులపై హత్యా కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ క్రాంతికుమార్ నాయకత్వంలో దర్యాప్తు సాగుతోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Double Murder: డబుల్ మర్డర్‌.. భార్య, అత్తను కత్తెరతో హత్య చేసిన అల్లుడు!

Ganesh Festival Tragedy: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. పశ్చిమగోదావరి, అల్లూరిలో ఆరుగురు మృతి!

Pune News: లవ్ ట్రాజెడీ.. పెళ్లి మాటలు అన్నారు, కొట్టి చంపేశారు

Telangana: దారుణం.. కుక్కకాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి

Gujarat News: సోషల్‌ మీడియా చిచ్చు.. వీధిలో దారుణహత్య, అమ్మాయి గొంతు కోసిన యువకుడు

Big Stories

×