Jagapathi Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సీనియర్ నటుడు జగపతిబాబు(Jagapathi Babu) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అదేవిధంగా ఈయన బుల్లితెరపై జయమ్ము నిశ్చయమ్మురా (Jayammu Nischayammuraa) అనే టాక్ షో కూడా ప్రారంభించిన సంగతి తెలిసినదే . ప్రస్తుతం ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడవ ఎపిసోడ్ కూడా ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్లో భాగంగా నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు.
జెర్సీ కథపై నమ్మకం కుదరలేదా…
జగపతిబాబు నాని మధ్య ఎన్నో సినిమాకు సంబంధించిన అంశాల గురించి వ్యక్తిగత ఫ్యామిలీ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే జగపతిబాబు నాని సినిమాల విషయంలో ఎంతో పశ్చాత్తాప పడుతున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. నాని (Nani)హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జెర్సీ(Jersey). ఈ సినిమా నాని కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా చెప్పాలి. అయితే ఈ సినిమాలో జగపతిబాబుకు కూడా నటించే అవకాశం వచ్చినట్లు తాజాగా ఈ కార్యక్రమంలో వెల్లడించారు. ఇందులో కోచ్ గా సత్యరాజ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ముందుగా జగపతిబాబుని సంప్రదించినట్టు తెలుస్తోంది.
నాని సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకోను…
ఇలా జగపతిబాబును ఈ పాత్ర కోసం సంప్రదించడంతో సినిమా కథపై తనకు పెద్దగా నమ్మకం లేకపోవడంతోనే ఈ పాత్రను రిజెక్ట్ చేశారని తెలియజేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత తాను చాలా ఫీల్ అయ్యానని, తన అంచనాలు తప్పని తెలుసుకున్నానని జగపతిబాబు వెల్లడించారు. అందుకే అప్పుడే తాను ఒక నిర్ణయం తీసుకున్నాను నాని హీరోగా సినిమాలు చేసినా, నిర్మాతగా సినిమాలు చేసిన ఆ సినిమాలలో నాకు అవకాశం వస్తే అసలు వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను అంటూ తాజాగా జగపతిబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
8 భాషలలో విడుదల కానున్న ది ప్యారడైజ్…
సినిమాల విషయంలో నాని జడ్జిమెంట్ ఎప్పుడు సరైనదిగానే ఉంటుందని చెప్పాలి. ఈయన హీరోగా నటించిన సినిమాలు గానీ నిర్మాతగా నిర్మించిన సినిమాలు కానీ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇక నాని ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే ఈయన ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా(Sreekanth Odela)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఇందులో నాని పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా 2026 మార్చి26 వ తేదీ ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.. ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేయబోతున్న సినిమాకి కూడా నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
Also Read: Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్