OG vs Pushpa : ఈ మధ్య అల్లు కనకరత్నమ్మ చనిపోయిన తర్వాత.. అల్లు – మెగా ఫ్యామిలీలు కలిసిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా అల్లు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఎదురువెళ్లి… హగ్ చేసుకోవడం, తర్వాత ఇద్దరు కూర్చున వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వాళ్లు కలిసిపోయారు అని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫ్యాన్స్ మరోసారి వీరి మధ్య చిచ్చు పెడుతున్నారు. ఓజీ సందర్భంగా పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం…
పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్షన్ మూవీ ఓజీ 25న రిలీజ్ కాబోతుంది. నిన్ననే (సోమవారం) మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని, హీరో పాత్ర గ్యాంగ్ స్టార్ అని తెలిసిపోతుంది. నిజానికి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో అని అందరికీ తెలుసు. డైరెక్టర్ సుజిత్ కూడా అదే చెప్పారు. అక్కడ ఓజీ అంటే ఓరిజినల్ గ్యాంగ్ స్టార్ అని కూడా మూవీ యూనిట్ చాలా సార్లు చెప్పింది.
దీన్నే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే… గతంలో పుష్ప సినిమా టైంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుష్ప సినిమా, అల్లు అర్జున్ అని స్పెషల్‌గా మెన్షన్ చేయకపోయినా… హీరో స్మగ్లింగ్ అంటూ అన్నాడు.
“అప్పట్లో సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. ఈ రోజుల్లో హీరో అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు” అని అన్నాడు. ఈ మాటలు అనే టైంలో పుష్ప 2 ఫీవర్ నడుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ అన్నది… తమ హీరో అల్లు అర్జునే అని, పుష్ప 2 సినిమానే అని అప్పట్లో బన్నీ ఫ్యాన్స్ అనుకున్నారు. ఆ మాటలు అప్పుడు సినిమాకు బానే డ్యామేజ్ చేశాయి.
అలాంటి కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించడంపై ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ తిరగబడుతున్నారు. స్మగ్లర్‌గా నటిస్తే ప్రాబ్లం ఉన్నాప్పుడు… గ్యాంగ్ స్టార్‌గా నటిస్తే ఏం ప్రాబ్లం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
స్మగ్లర్‌గా నటిస్తే ఆడియన్స్ తప్పుదారి పడితే, గ్యాంగ్ స్టార్స్ పాత్ర చేస్తే అదే ఆడియన్స్ ఏమైపోతారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదలో ఉన్నప్పుడు ఇలాంటి పాత్రలు చేసి… ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్‌పై ట్రోల్స్ చేస్తున్నారు.