BigTV English

Akhanda 2 Release: అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య… టార్గెట్ మామూలుగా లేదుగా!

Akhanda 2 Release: అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య… టార్గెట్ మామూలుగా లేదుగా!

Akhanda 2 Release: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ తన వయసుకు అనుగుణంగా ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇటీవల బాలయ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే అభిమానులకు కూడా పూనకాలు వస్తాయి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో అఖండ 2 (Akhanda 2)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.


పవన్ కోసం వెనకడుగు వేసిన బాలయ్య..

నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అఖండ2 చిత్ర బృందం వెనకడుగు వేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తదుపరి విడుదల తేదీ ఎప్పుడు అనే విషయం గురించి నిర్మాతలు ఇప్పటివరకు అధికారకంగా ప్రకటించలేదు అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలయ్య అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ ఆఖండ 2 విడుదల తేదీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2..


అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అంటూ ఆయన సహచర ఎమ్మెల్యేలు మంత్రులు ప్రశ్నించడంతో ఆయన మాట్లాడుతూ.. మరొక రెండు రోజులలో తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల అవుతుందని, అందుకే ఆఖండ 2 డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతుందని తెలియజేశారు. అయితే ఈ విషయం గురించి నిర్మాతలు అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది. అఖండ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నట్లు తాజాగా బాలయ్య వెల్లడించారు. హిందీ భాషలో కూడా ఈ సినిమా డబ్బింగ్ చాలా అద్భుతంగా వచ్చిందని తెలియజేశారు. అన్ని భాషలలోను ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నామని బాలకృష్ణ అఖండ 2 సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మాఫియా నేపథ్యంలో బాలయ్య మూవీ..

బోయపాటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై గోపి చంద్ అచంట,రామ్ ఆచంట నిర్మించగా నందమూరి తేజస్విని సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటి సంయుక్త మీనన్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తిరిగి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తదుపరి సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read: Boycott Sai Pallavi: బికినీ ఎఫెక్ట్.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ సాయి పల్లవి!

Related News

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!

OG vs Pushpa : గ్యాంగ్ స్టార్స్ అయితే పర్లేదా… పవన్‌పై తిరగబడుతున్న బన్నీ ఫ్యాన్స్

OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

Boycott Sai Pallavi: బికినీ ఎఫెక్ట్.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ సాయి పల్లవి!

Dulquer -Pruthivi Raj: ఆపరేషన్ నమకూర్ ..స్టార్ హీరోల ఇంట్లో కస్టమ్స్ సోదాలు

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ తో మళ్ళీ దొరికిపోయిన సామ్..రిలేషన్ కన్ఫామ్ చేయొచ్చుగా?

Mirai Movie: గుడ్ న్యూస్.. మిరాయ్‌లో వైబ్‌ వచ్చేసింది.. ఈ రోజు నుంచి సినిమాల్లో..

Big Stories

×