BigTV English

Mithun Reddy: జైల్లో ప్రొటీన్‌ పౌడర్ కావాలి.. ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డి పిటిషన్

Mithun Reddy: జైల్లో ప్రొటీన్‌ పౌడర్ కావాలి.. ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డి పిటిషన్

Mithun Reddy: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి రిమాండ్‌ ఖైదీ నంబరు 4196 కేటాయించారు. ఈ కేసులో ఆగస్టు 1 వరకూ రిమాండ్‌ విధించింది విజయవాడ ఏసీబీ కోర్ట్. దీంతో ఆయన్ను రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచారు అధికారులు. దీంతో ఆయన జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అల్పాహారం సహా మూడు పూటలా ఇంటి భోజనం.. కిన్లే వాటర్‌ బాటిళ్లు.. కొత్త పరుపుతో కూడిన మంచం.. కొత్త దిండ్లు.. వెస్ట్రన్‌ కమోడ్‌ కలిగిన ప్రత్యేక గది కోరారు.


వీటితో పాటు ప్రొటీన్‌ పౌడర్, ఓ టేబుల్, దానిపై తెల్లకాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్‌ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఇవాళ నేరుగా కోర్టులో హాజరై అభ్యంతరాలు చెప్పాలని నిర్దేశించింది.

అయితే ప్రత్యేక వసతులు కావాలంటూ అడ్వకేట్ కోరిన నిబంధనలు, నియమాల లెటర్‌హెడ్‌ను జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ తీసుకోలేదు. జైలులో మిథున్ రెడ్డికి న్యూస్ పేపర్, ప్రత్యేక బెడ్ కానీ సిబ్బంది ఇవ్వలేదు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు రాజమండ్రికి వస్తున్నారు. మిథున్‌రెడ్డితో ములాఖత్ కానున్నారు.


మరోవైపు లిక్కర్ స్కామ్‌ కేసు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. అసలు ఈ పాలసీని రూపొందించింది ఎవరు? డబ్బులు ఎవరి నుంచి ఎవరి చేతుల్లోకి మారింది? అంతిమ లబ్ధిదారులు ఎవరు? అనే దానిపై ఇప్పటికే సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో దిమ్మతిరిగే విషయాలు ఉన్నాయి. ఎందుకీ మాట అంటున్నామంటే.. ఈ స్కామ్‌ మొత్తం 3 వేల 500 కోట్లకు సంబంధించినది కాగా.. ఇందులో వైసీపీ పెద్దల పేర్లు కూడా ఉన్నాయి. ఏకంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ పేరు కూడా వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఎవరు? అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్.

మద్యం కుంభకోణంలో ముడుపులు ఏకంగా అప్పటి సీఎం జగన్ మోహన రెడ్డికి చేరాయంటోంది సిట్ చార్జీషిట్. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని గుర్తించింది సిట్. 2023 మేలో పలుమార్లు సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డితో మిథున్‌రెడ్డి మాట్లాడారని కూడా తమ విచారణలో గుర్తించింది సిట్ బృందం. అంతే కాదు నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్ తో మాట్లాడటం, మద్యం విధానాల మార్పు, ధరల పెంపు వంటి అంశాలను కూడా చర్చించినట్టు కూడా చెబుతున్నారు సిట్ అధికారులు.

యూఎస్ తో పాటు అరబ్ ఎమిరేట్స్ లో పలు షెల్ కంపెనీలను గుర్తించి.. అందులోకి పెట్టుబడులు పంపారనీ.. అయితే ఈ దేశాలకు నిధుల బదిలీ చేసుందుకు అధికారిక బ్యాంక్ చానెల్స్ లేవని వివరించింది రిమాండ్ రిపోర్ట్. అంతే కాదు 2019 అక్టోబర్ 13వ తేదీన మిథున్ రెడ్డి, ముప్పిడి అవినాష్‌ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సత్యప్రసాద్, విజయ సాయిరెడ్డి హైదరాబాద్ లో కలుసుకున్నారని వివరించింది రిమాండ్ రిపోర్ట్. నెలకు 50 నుంచి అరవై కోట్ల కమీషన్లు కిక్ బ్యాగ్స్ రూపంలో వస్తాయని మిథున్ రెడ్డి బృందం అంచనా వేసుకున్నట్టుగా గుర్తించారు విచారణాధికారులు.

Also Read: టీడీపీ పాలకమండలి సమావేశం.. వాళ్లకు నెలకు రూ.3 వేల నిరుద్యోగి భృతి

సో మొత్తంగా చూస్తే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. జగన్‌ పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.. మరి నెక్ట్స్‌ అరెస్ట్ అయ్యేది విజయసాయి రెడ్డేనా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకు అరెస్ట్ అయ్యారు. ఏ 30 కూడా అరెస్ట్ అయ్యాడు. ఏ5గా ఉన్న విజయసాయి రెడ్డి మాత్రం ఇంకా బయటే ఉన్నారు. మరోవైపు జగన్‌ పేరు ప్రస్తావించడంతో ఆయనను కూడా ఫిక్స్ చేసేందుకు సిట్ రెడీ అవుతుందా? అనేది ఇప్పుడు క్వశ్చన్.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×