TTD Meeting: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరుగనుంది. టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ఆధ్యక్షతన అన్నమయ్య భవనంలో.. ఉదయం 10:30 గంటలకు సమావేశం జరుగనుంది. మొత్తం 45 అంశాలు ఈ బోర్డు ముందుకు రానుండగా, వాటిలో కొన్ని భవిష్యత్ చర్యలకు దిశానిర్దేశం చేసేలా ఉండనున్నాయి.
కాంట్రాక్ట్ డ్రైవర్ల రెగ్యూలరైజేషన్‌పై చర్చ
ఈ సమావేశంలో ముఖ్యంగా టీటీడీలో పని చేస్తున్న.. కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చే అంశం కీలకంగా మారనుంది. గత కొన్నేళ్లుగా టీటీడీలో సేవలు అందిస్తున్న డ్రైవర్లకు.. ఉద్యోగ భద్రత కల్పించాలన్న అభిప్రాయంతో ఈ అంశంపై పాలకమండలి చర్చించనుంది.
పాత భవనాల పునర్నిర్మాణంపై నిర్ణయం
తిరుమలలో ఉన్న పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ క్రింద.. పునర్నిర్మించాలన్న ప్రతిపాదనపై కూడా ఈ సమావేశంలో చర్చించనుంది బోర్డు. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ రూపొందించబడినట్టు సమాచారం. డోనర్ల సహకారంతో పాత భవనాలను ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మించి, వాటిని భక్తుల అవసరాలకు అనుగుణంగా మార్చే దిశగా.. చర్యలు తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది.
వేద పారాయణదారులకు నెలకు రూ.3,000 ఉపాధి భృతి
అంతేకాదు, వేద పారాయణ సేవలు అందించే వారి కోసం.. నిరుద్యోగి భృతి రూపంలో నెలకు రూ.3,000 చెల్లించే.. ప్రతిపాదన కూడా బోర్డు ముందుకు రానుంది. ఆలయాల్లో రోజూ జరిగే వేద పారాయణానికి అంకితమైన వ్యక్తులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించడంతోపాటు.. వారి జీవనోపాధికి తోడ్పడే దిశగా ఈ తీర్మానం రూపుదిద్దుకోనుంది.
ఇతర ముఖ్య అంశాలు
సమావేశంలో పలు అభివృద్ధి పనులకు అనుమతులు, నూతన నియామకాలు, ఆలయ నిర్వహణకు సంబంధిత సాంకేతిక నిర్ణయాలు, భద్రతా పరిరక్షణ, వసతి విభాగం విస్తరణ తదితర అంశాలపై చర్చించనుంది. తిరుమల శ్రీవారి సేవలో మరింత పారదర్శకత, సమర్థత తీసుకొచ్చే దిశగా ఈ సమావేశం దిశానిర్దేశకంగా మారే అవకాశం ఉంది.
టీటీడీ పాలక మండలి సమావేశాలకు.. భక్తజనం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు నేరుగా.. లక్షలాది మంది భక్తుల ప్రయాణ అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి. వసతి, దర్శనం, లడ్డూ పంపిణీ, దర్శన టోకెన్లు, అన్నప్రసాద విభాగం, దానాలు వంటి అంశాల్లో పాలక మండలి తీసుకునే ప్రతి నిర్ణయం.. భక్తుల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు.
Also Read: అర్జెంట్ గా పాదయాత్ర! జగన్ వ్యూహం ఏంటి?
ఈరోజు జరగనున్న టీటీడీ పాలకమండలి సమావేశం.. అనేక మార్గదర్శక తీర్మానాలకు వేదికగా నిలిచే అవకాశం ఉంది. డ్రైవర్ల రెగ్యులరైజేషన్ నుండి డోనర్ స్కీమ్ల వరకూ, వేద పారాయణదారుల సంక్షేమం నుండి అభివృద్ధి ప్రణాళికల వరకూ.. ప్రతీ అంశం భక్తుల అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలని ఆశిస్తున్నారు. పాలక మండలి తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి పడింది.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం..
చైర్మన్ బీఅర్ నాయుడు ఆధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉ .10:30 గంటలకు సమావేశం
45 అంశాలపై చర్చించనున్న టీటీడీ బోర్డు
టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యూలరైజ్ చేసే ఆంశంపై చర్చించి.. తీర్మానం చేయనున్న బోర్డు
తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్… pic.twitter.com/PI337obiZI
— BIG TV Breaking News (@bigtvtelugu) July 22, 2025