HHVM Pre Release Event : పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ స్టార్టింగ్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో అందుకున్నారు కళ్యాణ్. జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ హిట్ సినిమా చేయలేదు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుని ఆ సినిమా. ఒక రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అని ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. అన్నింటిని మించి హరి శంకర్ ఆ సినిమాను డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్వతహాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో, కళ్యాణి ఎలా చూపించాలో అతనికి బాగా తెలుసు.
పవన్ కళ్యాణ్ ఫైర్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన రీసెంట్ టైమ్స్ లో ఓజి ఓజి అని అరవడం మొదలుపెట్టారు. సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన గ్లిమ్స్ వీడియో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అయితే నేడు హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ లో కూడా చాలామంది ఓజి అని అరవడం మొదలుపెట్టారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ఆ సినిమా కూడా మనదే, అది బయట సినిమా కాదు. ఇది ఓజి కాదు వీర అని ఫాన్స్ కు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పిన వెంటనే ఫ్యాన్స్ అంతా కూడా వీరా వీరా అని అరవడం మొదలుపెట్టారు.
అభిమానే దర్శకుడు
చాలామంది హీరోలకు అభిమానులు ఉండటం కామన్ గా జరుగుతుంది. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు చాలా మంది సెలబ్రిటీలే అభిమానులుగా ఉన్నారు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు జై పవర్ స్టార్ అని ప్రస్తుత దర్శకుడు సుజిత్ అరిచిన వీడియోలు పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేయగానే వైరల్ గా మారాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంటే చాలామందికి విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. స్వతహాగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అది కాకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ సినిమా అది. అంచనాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
Also Read: HHVM Pre Release Event : నా సినిమా టికెట్ ₹10 లకు అమ్మారు, మరోసారి పవన్ కళ్యాణ్ ఫైర్