Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఇప్పటికీ పాతిక పైగా సినిమాలు చేశారు. ఎక్కువ శాతం సినిమాలు రీమేక్ సినిమాలు. కొన్ని రీమేక్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అంటే కొంతమందికి నచ్చిన విషయమే ఇలాంటి రీమేక్ సినిమాలు.
పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని రీమేక్ సినిమాలు ఒరిజినల్ కంటే కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఖుషి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది. విజయ్ నటించిన ఖుషి సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక గబ్బర్ సింగ్ కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. ఒక రీమేక్ సినిమా ఆ స్థాయి హిట్ అయింది అంటే మామూలు విషయం కాదు కదా.
మీరు నన్ను తిట్టుకుంటారు
ఇక రీమేక్ సినిమాల ప్రస్తావన తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు చేస్తున్నందుకు మీరు నన్ను తిట్టుకుంటారు అని తెలుసు. కానీ ఎందుకు రీమేక్ సినిమాలు చేస్తున్నాను అంటే, మన కోసం పెద్దపెద్ద దర్శకులు ఎవరూ లేరు. చాలామంది నిర్మాతలు కూడా ఒక రీమెక్ సినిమా చేసి డబ్బులు సంపాదించుకుందాం అనే ఆలోచనలోనే ఉంటారు. అలానే నాకు కూడా డబ్బులు అవసరం. నేను పార్టీని నడపాలి, నా పెళ్ళాం పిల్లలను కుటుంబాన్ని చూసుకోవాలి అందుకు నేను ఎక్కువ శాతం డబ్బులు కోసమే రీమేక్ సినిమాలు చేశాను. కానీ మొదటిసారి ఏఎం రత్నం ఒక స్ట్రైట్ సినిమాతో నా దగ్గరికి వచ్చారు. అంటూ ఏం రత్నం గురించి మాట్లాడారు.
నేను ఓటమిలో త్రివిక్రమ్ వచ్చాడు
నేను చేసిన తప్పేమైనా ఉంది అంటే ఒక ప్లాప్ సినిమా చేయటం. అక్కడి నుంచి నేను మళ్ళీ రీమేక్ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అందరూ సక్సెస్ ఉన్నప్పుడు దగ్గరకు వస్తారు. కానీ నేను ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చాడు. ఆయన నాకు మంచి స్నేహితుడు, ఆత్మీయుడు. ఆ టైంలో వచ్చి నాతో జల్సా సినిమా తీసి నా కోసం నిలబడ్డాడు. అంటూ త్రివిక్రమ్ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు సినిమాలు స్ట్రైట్ ఫిలిమ్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకరకంగా స్ట్రైట్ ఫిలిం అని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
Also Read: HHVM Pre Release Event : ఫ్యాన్స్ పైన పవన్ కళ్యాణ్ ఫైర్, ఓజి అంటారేంటి, ఇది వీరా