HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మనల్ని ఎవడ్రా ఆపేది
సరిగ్గా రెండు సంవత్సరాలు క్రితం భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు సినిమా టికెట్ రేట్లు 100 లో ఉండేవి. కానీ నా సినిమా టికెట్ రేట్ మాత్రం కేవలం పది రూపాయలు. నేను అప్పుడే చెప్పాను మనలో ఎవడ్రా ఆపేది అని. ఇది డబ్బు గురించి మాట్లాడుతున్నది కాదు. గట్స్ గురించి మాట్లాడుతున్నాను, కరేజ్ గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డ్స్ కోసం ప్రయత్నం చేయలేదు. నేను పెద్దగా ఏమీ కోరుకోలేదు. సగటు మనిషిగా బతుకుదాం అనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు.
తెలియకుండా కాలం అలా వెళ్లిపోయింది
నేను పడి లేచిన, ఏమి సాధించినా నా వెనక మీరు నిలబడ్డారు. అన్నా మేమున్నాం అని ధైర్యం చెప్పారు. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. ఏమీ తెలియకుండా కాలం అలా వెళ్ళిపోయింది. ఇదే శిల్పకళా వేదికకి గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ కోసం వచ్చాను. మహబూబాద్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక హిట్ ఇవ్వు అన్నా అని అడిగాడు. ఆరోజు నేను దేవుడిని అడిగాను నా అభిమానుల కోసం ఒక్క హిట్ సినిమా ఇమ్మని. అది హరీష్ శంకర్ ద్వారా గబ్బర్ సింగ్ రూపంలో వచ్చింది.
నేను బంధానికి ప్రాముఖ్యత ఇచ్చాను
ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఇండస్ట్రీలో అది ఎక్కువగా కనిపిస్తుంది. జానీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చాను. నా దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇచ్చేశాను. నేను డబ్బులుకి ఏనాడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు బంధానికి ప్రాముఖ్యత ఇచ్చాను. నేను ఫ్లాప్ సినిమా తీయడం వల్ల వరుసగా రీమేక్ సినిమాలు చేయాల్సి వచ్చింది. నాకు పెద్ద పెద్ద డైరెక్టర్ ఎవరు లేరు. వీటితో ఒక రీమేక్ సినిమా చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచనలోనే చాలామంది ఉన్నారు.
Also Read : HHVM Pre Release Event : త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి మాట్లాడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి