BigTV English

Roja Comments: తొలిసారి టీడీపీ గురించి పాజిటివ్ గా మాట్లాడిన రోజా.. ఏమన్నారంటే?

Roja Comments: తొలిసారి టీడీపీ గురించి పాజిటివ్ గా మాట్లాడిన రోజా.. ఏమన్నారంటే?

పదేళ్లు పార్టీలో అవకాశం ఇచ్చారు.
మహిళా విభాగం అధ్యక్షురాలిని చేశారు.
రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ తనకు ఇచ్చిన అవకాశాల గురించి రోజా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి. అవును ఆమెకు పదేళ్లపాటు టీడీపీ అవకాశాలిచ్చి ప్రోత్సహించింది. ఆమె రాజకీయానికి బలమైన పునాది వేసింది. పార్టీలో ఎంతో పోటీ ఉన్నా.. మహిళా విభాగం అధ్యక్షురాలిని చేసి గౌరవించింది. ఒకసారి ఓడిపోయినా రెండోసారి కూడా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ధైర్యాన్నిచ్చింది . తనకు ఇన్ని చేసిన పార్టీ, తాను బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్రవేసి వేధించింది అంటూ వాపోయారు రోజా. టీడీపీ నేతలు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటున్న ఆమె చట్టపరంగా వారిని ఎదుర్కొంటానన్నారు.


టార్గెట్ భానుప్రకాష్..
టీడీపీ నేతలు తనని టార్గెట్ చేసి మరీ ఘాటు విమర్శలు చేస్తున్నారనేది రోజా ప్రధాన కంప్లయింట్. అందులోనూ ఆమె నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విమర్శలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. తన గురించి నీఛంగా మాట్లాడారని వాపోయారు. గతంలో కూడా టీడీపీ తన విషయంలో ఇలాగే ప్రవర్తించిందన్నారు. అన్ని అవమానాలను తట్టుకుని ఎదిగానని, ఇంకా తనను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని అన్నారు రోజా. ఈ క్రమంలో ఆమె మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు.

మరి వీటి సంగతేంటి..?
తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడం విశేషం. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై తాను చేసిన విమర్శలను ఆమె సమర్థిస్తూ మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. మహిళగా తనపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు మాత్రం సమర్థనీయం కాదంటున్నారు రోజా.

వైసీపీనుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే అప్పటి టీడీపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేసిందని ఏడాదిపాటు తాను అసెంబ్లీకి హాజరవకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు రోజా. ఇప్పుడు కూడా తనను అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ లకు అసభ్య కామెంట్లు పెడుతున్నారని, మానసికంగా తనను వేధిస్తున్నారని వాపోయారు. అయితే తాను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నానని, మరింత రెట్టించిన ఉత్సాహంతో రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు రోజా.

రోజా చేసిన వ్యాఖ్యలు, రోజాపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. రోజాకి మద్దతుగా వైసీపీ మీడియా, సోషల్ మీడియా పోస్టింగ్ లు పెడుతున్నాయి. ఆమెకు మిగతా హీరోయిన్లు కూడా మద్దతిచ్చారని సాక్షి కథనాలిస్తోంది. అదే సమయంలో టీడీపీ సోషళ్ మీడియా మాత్రం రోజాని టార్గెట్ చేస్తూ మరింత ఘాటుగా విమర్శిస్తోంది. ఆమె గతంలో చేసిన విమర్శల వీడియోలను బయటపెడుతూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. మీ వరకు వస్తే మీకు నొప్పి తెలిసిందా అంటున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ గతంలో రోజే చేసిన వ్యాఖ్యలతోనే ఆమెకు బదులిస్తున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×