Hari Hara Veeramallu Business : పవన్ కళ్యాణ్ పీరియాడికల్ మూవీ హరి హర వీరమల్లు. దాదాపు 6 ఏళ్ల షూటింగ్. అంతకు మించిన ఎదురుచూపులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌వి. అలాంటి మూవీ కోసం ఈ మధ్య ఓ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అదే జూన్ 12. పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తి అవ్వడం, డైరెక్షన్ సాయం కోసం త్రివిక్రమ్ చేయి వేయడంతో అంతా పూర్తి అయింది.
అందుకే జూన్ 12న వరల్డ్ వైడ్‌గా హరి హర వీరమల్లును రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ, వాయిదా వేశారు. దీనికి కారణం సినిమాకు ఇంకా బిజినెస్ కాకపోవడమే. బిజినెస్ ఎందుకు కాలేదు అంటే.. సినిమా సీజీ వర్క్ కాలేదు. దీంతో సినిమా ట్రైలర్‌ను కట్ చేయలేదు. వీటి అన్నింటీ ఫలితం… సినిమాపై బజ్ క్రియేట్ అవ్వలేదు.
సినిమాపై బజ్ క్రియేట్ అయితే… బిజినెస్ చేయడానికి బయ్యర్లు ముందుకు వస్తారు. కానీ, అది ఆ టైంలో హరి హర వీరమల్లు సినిమాకు కరువయింది. ఫలితంగా సినిమాను జూన్ 12 నుంచి వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత.. మూవీకి సంబంధించిన సీజీ వర్క్ కంప్లీంట్ చేశారు. ట్రైలర్ కట్ అయింది. ఆ తర్వాత ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌ను సినిమా ట్రైలర్ లో చూడటంతో.. అది కూడా చాలా పవర్ ఫుల్‌గా చూడటంతో ఆయన అభిమానులు ఖుషి అయిపోయారు.
వీటితో పాటే సినిమాపై బజ్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడిప్పుడే బయ్యర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం.. మూవీ బిజినెస్ ఇలా జరిగినట్టు తెలుస్తుంది.
నైజం ఏరియాలో వీరమల్లు రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రైట్స్ దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు టాక్. అలాగే ఆంధ్ర రైట్స్ ను దాదాపు 70 నుంచి 75 కోట్ల వరకు విక్రయించినట్టు తెలుస్తుంది. ఇక సీడెడ్ రైట్స్ 20 నుంచి 25 కోట్ల వరకు పలికినట్టు సమాచారం.
ఇవి అన్నీ కూడా ప్రస్తుతం అడ్వాన్స్ బేసెస్ పైనే ఉన్నాయట. అంటే, నిర్మాత చేతికి కరెక్ట్‌గా డబ్బు రావాలంటే… సినిమాకు తప్పపని సరిగా ఫుల్ పాజిటివ్ టాక్ రావాలి. మిక్సిడ్ టాక్ వచ్చినా… నిర్మాతకు నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది.