Siddarth: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన వారిలో నటుడు సిద్దార్థ్ (Siddarth)ఒకరు. తెలుగులో బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనంతరం బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే ఇటీవల కాలంలో సిద్ధార్థ్ సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోని నేపథ్యంలో ఈయన నిర్మాతగా మారి తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సిద్దార్థ్ 3bhk సినిమా(3 BHK Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.
మా గృహప్రవేశానికి వచ్చిన…
ఇలా ఈ సినిమాకు మంచి సక్సెస్ రావడంతో చిత్ర బృందం థాంక్స్ మీట్ (Thanks Meet)కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమాని మంచి విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటి దేవయాని(Devayani) కూడా ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..మా గృహప్రవేశానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సినిమాని ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కొడుకు లేని లోటు…
ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ తల్లిదండ్రుల పాత్రలలో దేవయాని, శరత్ కుమార్(Sarath Kumar) నటించిన విషయం తెలిసిందే.సిద్దార్థ్ ఈ సినిమాలో కొడుకుగా నటించడమే కాకుండా నిజజీవితంలో కూడా నాకు కొడుకు లేరనే లోటును తీర్చారంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. నాకు ఇద్దరు అమ్మాయిలే, అబ్బాయి లేరని లోటు ఉండేది, కానీ సిద్దార్థ్ వల్ల ఆలోటు కూడా తీరిపోయిందని నాకు సిద్దార్థ్ దేవుడిచ్చిన కొడుకు అంటూ దేవయాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక దేవయాని ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.
సుస్వాగతం…
తమిళంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తున్న దేవయాని తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన సుస్వాగతం (Suswagatham) సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెబుతూ తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ దేవయాని ఎంతో బిజీగా ఉన్నారు. మొదటిసారి మహేష్ బాబు హీరోగా నటించిన నాని సినిమాలో మహేష్ బాబుకి తల్లిపాత్రలో నటించినట్లు తెలియజేశారు. నిజానికి ఆ సినిమాలో తల్లి పాత్రలో చేయడం అసలు ఇష్టం లేదని, డైరెక్టర్ గారి బలవంతం మేరకే తాను మహేష్ బాబుకు తల్లిపాత్రలో నటించాను అంటూ ఇటీవల దేవయాని తెలియజేశారు.
Also Read: Allu Arjun: బన్నీ చాలా కోపిస్టి.. కొడితే కళ్ళజోడు విరిగిపోయింది.. ఏమైందంటే?