BigTV English

OG Pre Release Event: ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ ప్లాన్‌.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

OG Pre Release Event: ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ ప్లాన్‌.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

OG Pre Release Event: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న లెటేస్ట్‌ మూవీ ‘ఓజీ'(OG Movie‌ ). సాహో ఫేం, యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. సెప్టెంబర్‌ 25న ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మూవీ టీం గట్టి ప్లాన్‌ చేస్తుందట. వచ్చే నెల రెండో వారంలో ఓజీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి భారీగా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.


వినాయక చవితికి మరో అప్డేట్సె

కాగా ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో పవన్‌ లుక్‌ బాగా ఆకట్టుకుంది. ప్రచార పోస్టర్స్‌తో మూవీ విపరీతమైన బజ్‌ నెలకొంది. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల వాయిదా పడింది. ఇటీవల సెట్లో అడుగుపెట్టిన ఆయన చకచక షూటింగ్‌ని పూర్తి చేశారు. పవన్‌ పార్ట్‌కి సంబంధించి షూటింగ్‌ పూర్తి కాగా.. మిగతా ఆర్టిస్టుల షూటింగ్ పార్ట్‌తో పాటు కొంత ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది. దీనితో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని చూడా జరుపుకుంటున్నారు.


ఓజీ ప్రీ రిలీజ్ డేట్ అప్పుడే

ఈ క్రమంలో మూవీకి సంబంధించి సెకండ్‌ సింగిల్‌ని వినాయక చవితి సందర్భంగా విడదలు చేయనున్నారు. సువ్వి సువ్వి అంటూ సాగే మెలోడి పాట‌ని ఆగస్టు 27న రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక రిలీజ్‌కు సరిగ్గా నెల రోజులే ఉంది. దీంతో మూవీ టీం ప్రమోషనల్‌ కార్యక్రమాలకు వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ ప్లాన్‌ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారట. సెప్టెంబర్ 18 లేదా 19వ తేదీ ఓజీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని మూవీ టీం నిర్ణయించింది. అంతా ఒకే అయితే ఏపీలోనే గ్రాండ్‌ ఈ వెంట్‌ని జరగనుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

కాగా ఇందులో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రతి కథానాయకుడిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా.. ప్రియాంక మోహన్ ఆరుళ్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  హరి హర వీరమల్లు చిత్రంలో డిసప్పాయింట్ లో ఉన్న ఫ్యాన్స్ ఓజీ ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Related News

Kollam Thulasi: భార్య, కూతురు ఛీ కొట్టారు.. అనాథలా ఆశ్రమంలో ప్రముఖ నటుడు

Dhanush: ఒక్క లైక్.. ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమైన ధనుష్ – మృణాల్.. పోస్ట్ వైరల్!

AA 26× A6: సినీ కార్మికుల సమ్మె.. రోజుకు కోట్లలో నష్టపోయిన బన్నీ నిర్మాతలు!

Actress Sridevi: నటి శ్రీదేవి పస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఏం చేశారో తెలుసా.. ఇలా కూడా చేస్తారా?

Parineeti Chopra: తల్లి కాబోతున్న పరిణితి చోప్రా.. పోస్ట్ వైరల్!

Big Stories

×