BigTV English

OG Movie Update: క్లారిటీ ఇచ్చిన ఓజీ మేకర్స్, పవన్ ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ మొదలు పెట్టండి

OG Movie Update: క్లారిటీ ఇచ్చిన ఓజీ మేకర్స్, పవన్ ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ మొదలు పెట్టండి

OG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. దీని కారణం స్వతహాగా ఈ సినిమా దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కు అభిమాని కావడం. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో ఒక క్లారిటీ ఉంటుంది. ఈ విషయంలో హరీష్ శంకర్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. దాదాపు 10 ఏళ్ల పాటు రాని సక్సెస్ ను ఒక గబ్బర్ సింగ్ సినిమాతో ఇచ్చి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాడు.


గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి డైలాగ్ కూడా థియేటర్లో బీభత్సంగా పెరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ ఏంటో మరోసారి తెలిసి వచ్చింది. ఇక ప్రస్తుతం సుజీత్ కూడా అదే స్థాయిలో హిట్ ఇస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.

ఓజి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు 


రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా రిలీజ్ డేట్ చెప్పి దానిని పోస్ట్ పోన్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది. వాస్తవానికి ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ కావలసి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడు కూడా విశ్వంభరా సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా వాయిదా పడుతుంది అని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఒక్క అధికారిక ప్రకటనతో చెక్ పెట్టింది చిత్ర యూనిట్. మా దగ్గర ఉన్న టపాసులు అన్నీ పేల్చేసాం. ఇంకా థియేటర్స్ లో మీరు పేల్చడమే మిగిలింది. అంటూ మరోసారి అఫీషియల్ గా ఓ జి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

అభిమానుల ఆశలన్నీ ఆ సినిమా పైన 

పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఓ జి సినిమా స్థాయి వేరు దాని స్థానం వేరు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ విపరీతమైన అంచనాలను పెంచింది. గ్యాంగ్ స్టార్ లో పవన్ కళ్యాణ్ చూసిన వెంటనే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అభిమానులు అంచనాలన్నీ ఓజీ పైనే ఉన్నాయి.

Related News

Hero Darshan Case : హీరో దర్శన్‌కు ఉరిశిక్ష.. బెంగళూరు కోర్టులో హైడ్రామా

Ghaati Action Trailer : అనుష్క యాక్షన్‌కి గూస్‌బంప్స్… ఇది లేడీ బ్లడ్ బాత్

Mad Movie : ‘మ్యాడ్’ మూవీలో పాత్ర మిస్ చేసుకున్న ‘లిటిల్ హార్ట్’ హీరో మౌళి… అది చేసి ఉంటే వేరే రేంజ్..

Shilpa Shetty: సొంత రెస్టారెంట్ మూసివేయడంపై స్పందించిన శిల్పా శెట్టి.. ఏమన్నారంటే?

Avatar 2 : మళ్లీ థియేటర్లలోకి అవతార్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Tollywood Hero: తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. ఆలస్యంగా వెలుగులోకి!

Big Stories

×