BigTV English

Dhruv Jurel : రిషబ్ పంత్ కి గాయం.. జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా..?

Dhruv Jurel : రిషబ్ పంత్ కి గాయం.. జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా..?

Dhruv Jurel  : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం  మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ పడుతుండగా చేతి వేలికి గాయం అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి కీపింగ్ చేస్తుండగా బంతి అతని వేలుకి బలంగాా తాకింది. దీంతో ఫిజియో థెరపిస్ట్ వచ్చి వేలికి ట్రీట్ మెంట్ చేసినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చి కీపింగ్ చేశాడు. ఇవాళ కూడా ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.


Also Read : Radhika Murder Case : రాధిక హత్య వెనుక బిగ్ ట్విస్ట్.. ప్రియుడితో రాసలీలలు.. ఆ ఒక్క వీడియోనే కొంప ముంచిందా

పంత్ బ్యాటింగ్ చేస్తాడా..? 


రిషబ్ పంత్ గాయం పై ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి ఆటలోకి రాకుంటే టీమిండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం.. సబ్ స్టిట్యూట్స్ ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయలేడు. అంపైర్ అనుమతితో కీపింగ్ మాత్రమే చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కేవలం కంకషన్ (తలకు గాయం) అయితేనే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్/బౌలింగ్ చేయగలడు. కానీ పంత్ వేలికి గాయంతో జురెల్ సబ్ స్టిట్యూట్ గా వచ్చాడు. మరోవైపు రిషబ్ పంత్ త్వరగా కోలుకొని బ్యాటింగ్ చేయాలని అబిమానులు కోరుకుంటున్నారు. రిషబ్ పంత్ బ్యాటింగ్ లో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్ రెండింటీలో సెంచరీ చేసి ఔరా అనిపించాడు.

డ్యూక్ బాల్స్.. 

రెండో టెస్టులో కూడా సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ హాఫ్ సెంచరీతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడో టెస్టులో కూడా పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ ఊహించని విధంగా వేలుకి గాయం కారణంగా దూరమయ్యాడు. అసలు ఇప్పుడు రిషబ్ పంత్ బ్యాటింగ్ కి వస్తాడా..? రాడా అనే ప్రశ్న తలెత్తింది.  దాదాపు రిషబ్ పంత్ గాయం ఒకవేళ పెద్దది అయితే కేవలం 10 మంది బ్యాటర్లు మాత్రమే క్రికెట్ ఆడుతారు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో కనిపిస్తుంది. టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు మిస్ చేయకుంటే ఎప్పుడో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యేది.  387 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ బౌలింగ్ ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, కే.ఎల్. రాహుల్ క్యాచ్ లు మిస్ చేశారు. ఇదిలా ఉంటే.. టెస్ట్ సిరీస్ లో డ్యూక్ బాల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 80 ఓవర్లకు మార్చాల్సిన బంతి 8 ఓవర్లకే షేప్ మారిపోతుంది. దీనిపై ఇరు జట్ల ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఐసీసీ స్పందించడం లేదు. తొలి టెస్టులో అంపైర్ తో వదించి రిషబ్ పంత్ ఫైన్ కూడా ఎదుర్కొవడం గమనార్హం. ఇవాళ కూడా శుబ్ మన్ గిల్, బౌలర్లు బంతిని మార్చాలని కోరారు.

 

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×