OG Update:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్యకాలంలో తాను సైన్ చేసిన మూడు చిత్రాలను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే జూలై 24వ తేదీన జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు(Harihara veeramalu) సినిమాను రిలీజ్ చేశారు. క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాను.. జ్యోతి కృష్ణ పూర్తి చేసి రిలీజ్ చేయడం జరిగింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఏం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత హరిహర వీరమల్లు 2 సినిమా కూడా 30% షూటింగ్ పూర్తి అయ్యిందని.. హీరోయిన్ సీక్వెల్ పై కూడా అప్డేట్ ఇచ్చేసింది.
వినాయక చవితి స్పెషల్.. ఓజీ నుండి స్పెషల్ అప్డేట్..
ఇక మరొకవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో మూవీ ఓజీ (OG). రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas ) తో ‘సాహో’ సినిమా చేసి మంచి గుర్తింపు అందుకున్న డైరెక్టర్ సుజీత్(Sujith ) దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా అభిమానుల కోసం ఒక అప్డేట్ విడుదల చేసింది చిత్ర బృందం. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఓజీ టీ షర్ట్స్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ప్రారంభమైనట్లు చెబుతూ.. ఆ టీ షర్ట్ ఎలా ఉంటుంది? అనే వివరాలతో పాటు ఎక్కడ కొనుగోలు చేయాలి? అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్ ను కూడా విడుదల చేశారు.
ఓజీ టీ షర్ట్స్ ప్రీ ఆర్డర్స్ బుకింగ్ సేల్ షురూ..
అంతేకాదు ప్రీ ఆర్డర్స్ బుకింగ్ సేల్ మొదలైంది.. అభిమానులు త్వరపడాలి.. లిమిటెడ్ స్టాక్ అంటూ కూడా క్యాప్షన్ జోడించారు. అభిమానుల కోసమే ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ టీ షర్ట్స్ చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో అటు అభిమానులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా ఓజీ మూవీ నుండి విడుదల చేసిన ఈ వీడియోలో.. ఓజీ అనే టైటిల్ తో బ్లాక్ కలర్ టీ షర్ట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. .killing it up brutal అనే లెటర్స్ తో బ్యాక్ సైడ్ రూపొందించగా.. ముందు భాగం ప్యాకెట్ పై ఓజీ అనే లెటర్ తో డిజైన్ చేశారు.
ధర ఎంత? ఎక్కడ ఆర్డర్ చేయొచ్చు?
ఇక ఈ టి షర్టు ధర ఒక్కొక్కటి సుమారుగా రూ.2000 అని సమాచారం. కొనుగోలు చేయాలనుకున్నవారు www.theogwear.com అనే వెబ్సైటు ద్వారా కొనుగోలు చేయవచ్చు.
also read:Maaman OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మామన్.. ఎక్కడంటే?
A collection crafted for the fans ❤️#OG Merchandise Pre Orders are live. Limited and special. 🤗https://t.co/OAyvIWn3bF #TheyCallHimOG pic.twitter.com/effkJNW1cB
— DVV Entertainment (@DVVMovies) August 27, 2025