BigTV English

Maaman OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మామన్.. ఎక్కడంటే?

Maaman OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మామన్.. ఎక్కడంటే?

Maaman OTT:ప్రముఖ కమెడియన్ సూరి (Soori) ఈమధ్య హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన మరో చిత్రం మామన్ (Maman). ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్ గా.. సూరి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి ప్రశాంత్ పాండియరాజన్ దర్శకత్వం వహించారు. లార్క్ స్టూడియోస్ పతాకంపై కే కుమార్ నిర్మించారు. బాల శరవణన్ , బాబా భాస్కర్, విజి చంద్రశేఖర్ నిఖిలా శంకర్ , రాజ్ కిరణ్, గీతా కైలాసం వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 8 నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది.


ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మామన్

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ Zee 5 వేదికగా తమిళంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27 నుండి తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు జీ ఫైవ్ కూడా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు, కన్నడ ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.


మామన్ సినిమా స్టోరీ..

ఐశ్వర్య లక్ష్మి ,సూరి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం స్టోరీ విషయానికి వస్తే.. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అనే అక్కాతమ్ముళ్లు నివసిస్తూ ఉంటారు. తన అక్కంటే ఇన్బాకు ఎనలేని ప్రేమ. అయితే గిరిజకు చాలా సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుడతాడు. నేను అల్లుడిని ముద్దుగా లడ్డు అని పిలుస్తూ ఉంటాడు. అల్లుడిని అపురూపంగా చూసుకునే ఈయన రేఖను పెళ్లి చేసుకుంటాడు. అయితే లడ్డు వీరితో ఉండడం రేఖకు నచ్చదు. ఈ క్రమంలోనే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? లడ్డు వల్ల రేఖ – సూరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతారా? అసలేం జరిగింది? అనే విషయాలు తెలియాలి అంటే మామన్ సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఒక ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

సూరి కెరియర్..

సూరి కెరియర్ విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు రామలక్ష్మణన్ ముత్తుచామి. తమిళ హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సూరి ఈ మధ్యకాలంలో హీరోగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన హీరో గానే కాకుండా టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించారు. వరుస పెట్టి హీరోగా సినిమాలు చేస్తూ హీరోగా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే హీరోగా సక్సెస్ అయ్యి మరిన్ని అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Heroine Poorna: ఈ దూరం భరించలేను.. సంచలన పోస్ట్ పెట్టిన పూర్ణ భర్త!

Related News

Kingdom OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన కింగ్డమ్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Sundarakanda OTT: నారా రోహిత్ ‘ సుందరాకాండ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : కాబోయే భర్తను వదిలేసి మరో అమ్మాయితో… ఇద్దరమ్మాయిల అరాచకం… ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ

OTT Movie : ఈ డైరెక్టర్ కు చిప్ దొబ్బిందా ఏంటి మావా ? సైకో బ్రూటల్ కిల్లింగ్స్… సినిమా మొత్తం అవే సీన్లు

OTT Movie : ఓటీటీలో బ్యాన్ అయిన మూవీ… వీక్ హర్టెడ్ పీపుల్ చూడకూడని హర్రర్ స్టోరీ.. సర్ప్రైజింగ్ కాన్సెప్ట్

Big Stories

×