OG Pre-Release Event: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘ఓజీ‘ (OG Movie Release Date). సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇంకా సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉండటంతో మూవీ టీం ప్రమోషన్స్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రేపు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించి ట్రైలర్ లాంచ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేసింది. ఇందుకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వెంట్ ఎక్కడ జరగనుంది? తెలంగాణ? ఆంధ్రప్రదేశ్? తెలియాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి!
‘సాహో‘ ఫేం సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి మంచి హైప్ ఉంది. ప్రకటనతోనే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక చిత్రం నుంచి విడుదలైన పవన్ ఫస్ట్ లుక్ విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రచార పోస్టర్స్, గ్లింప్స్, టీజర్తో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఓజీపై విపరీతమైన బజ్ ఉంది. గ్లింప్స్ హీరో, విలన్ ఎలివేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ని నెక్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లింది. ఇక మూవీ వస్తున్న హైప్ చూసి ఓజీ మేకర్స్ వణికిపోతున్నారు.
హరి హర వీరమల్లు మూవీ రిజల్ట్ రిపీట్ అవుతుందేమోనని జంకుతున్నారు. అందుకే మూవీ టీం ట్రైలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోనుందట. మూవీపై హైప్ పెంచేలా విధంగా కాకుండా సదా సీదాగా కట్ చేసి.. థియేటర్లలో దుమ్మురేపాలని చూస్తున్నారు. అందుకే మేకర్స్ ట్రైలర్ విషయంలో గొప్పకు పోకుండ యావరేట్ ఉండాలని దర్శకుడు సుజిత్కి సూచించారట.ఈ ట్రైలర్ లాంచ్‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేయనున్నారు. రేపు హైదరాబాద్లోని రెండు ప్రముఖ ప్రాంతాలను ఓజీ ప్రీ రిలీజ్ (OG Pre Release Event) వేడుక కోసం బుక్ చేశారట. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు ప్రాంతాలను సెలక్ట్ చేసుకున్నారట. ఒకవేళ వర్షం పడితే శిల్పారామంలోని శిల్పాకళ వేదికలో ప్రీ రిలీజ్ వేడుక ఉండోచ్చు.
Also Read: Oscar 2026: ఆస్కార్ నామినేషన్స్.. పుష్ప 2తో పోటీ పడుతున్న ‘కన్నప్ప‘
అదే వర్షం లేకపోతే మాత్రం ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ఇందుకోసం మూవీ టీం ఇప్పటికే రాష్ట్ర నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు ఫైనల్ డెస్టినేషన్‌ని డిసైడ్ చేసి ప్రకటన ఇవ్వనుంది మూవీ టీం. ఈ రోజు సాయంత్రం లోపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడనేది ఓజీ మూవీ టీం అధికారికంగా ప్రకటించనుంది. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు వస్తున్నందున్న ఎల్పీ స్టేడియంలో ఈవెంట్ని ఘనంగా ప్లాన్ చేశారట. ఒకవేళ వర్ష సూచన ఉంటే మాత్రం ఈ కార్యక్రమం శిల్పాకళ వేదికలో జరగనుంది. తమిళ్ బ్యూటీ ప్రియాంక మో హన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ప్రతి కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.