Dunith Wellalage : శ్రీలంక ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే ఈనెల 18న కొలొంబోలో మరణించిన విషయం తెలిసిందే. అతను చనిపోయిన సమయంలో శ్రీలంక జట్టు అప్గానిస్తాన్ తో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో అప్గానిస్తాన్ ఆల్ రౌండర్ వరుసగా 5 సిక్సులు కొట్టడం విశేషం. తన తండ్రి మరణించిన తరువాత శ్రీలంక కి వెళ్లిన దునిత్ వెల్లలాగే తన తండ్రిని చివరి చూపు చూసి వెంటనే తిరుగు పయణం అయ్యాడు. ఇవాళ జరిగే సూపర్ 4 మ్యాచ్ కి అందుబాటులో ఉండనున్నాడు. ఇవాళ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ జరుగనుంది.
Also Read : Ind vs Pak : సూపర్ 4కు ముందు పాకిస్థాన్ కు మరో షాక్ ఇచ్చిన ఐసీసీ..ఇక చుక్కలు చూడాల్సిందే
అయితే దునిత్ వెల్లలాగే తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే అతను ఆసియా కప్ 2025 సూపర్ 4 ఆడేందుకు సిద్దమై యూఏఈకి చేరుకున్నాడు. రేపు తన తండ్రి అంత్య క్రియలు కొలొంబోలో జరుగనున్నాయి. కానీ ఇవాళ మ్యాచ్ ఉండటంతో తప్పనిపరిస్థితిలో వచ్చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశం కోసం ఎంత త్యాగం అంటూ కొనియాడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఈనెల 18న రాత్రి శ్రీలంక క్రికెటర్ వెల్లలాగే తండ్రి సురం వెల్లలాగే అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే అతను తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతని మేనేజర్ మహింద్ర హలంగోడ్ అతని పాటే వచ్చాడు. ఆ తరువాత మళ్లీ ఇద్దరూ కలిసి దుబాయ్ కి చేరుకున్నారు. శ్రీలంక వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి సూపర్ 4 కి అర్హత సాధించింది.
దునిత్ వెల్లలాగే కెరీర్ ఎలా ఉందంటే?
అయితే ఈ మ్యాచ్ వెల్లలాగే కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చివరి ఓవర్ లో 5 సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే అతనికి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇవాళ మరికొద్ది సేపట్లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. వెల్లలాగేకి ఇది 5వ టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఆసియా కప్ 2025 టీ 20నే అతనికి మొదటి మ్యాచ్. అతను శ్రీలంక తరపున 31 వన్డేలు ఆడాడు. ఆగస్టు 2024లో జరిగిన మ్యాచ్ లో అతను 27 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్ లో అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 2023 ఆసియా కప్ లో కూడా అతను 5 వికెట్లు తీశాడు. 2023 ఆసియా కప్ లో మొత్తం 10 వికెట్లతో సంయుక్తంగా రెండో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.
Dunith Wellalage is on a mission.
While his father’s body is still at home, He leaves for UAE to rejoin his team which is all set to play in the super 4’s in Asia cup 2025. What a sacrifice this is.. BTW his father’s funeral is to take place tomorrow (21) at Colombo.… pic.twitter.com/fDqjKcK25Y
— Nibraz Ramzan (@nibraz88cricket) September 20, 2025