Nandyala: నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా రూపన గూడ చెరువు పొంగి నీళ్లు రహదారిపై ఉద్రృతంగా ప్రవహించడంతో జమ్మలమడుగు నుంచి కొవెలకుంట్ల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ ప్రవాహంలో చిక్కుకుంది.ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు జెసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.